28.7 C
Hyderabad
April 20, 2024 09: 48 AM
Slider కర్నూలు

శ్రీశైలంలోని కమ్మ సత్రంలో ఒకరిని కొట్టి చంపిన యాత్రీకులు

#SrisailamMurder

శ్రీశైలం మహాక్షేత్రంలోని కాకతీయ కమ్మ సత్రం అన్నదాన మందిరంలో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో అన్నదాన సత్రంలో పని చేస్తున్న బొడ్డు శ్రీను అక్కడికక్కడే మరణించాడు.

మద్యం మత్తులో అక్కడి సిబ్బందితో యాత్రీకులు ఘర్షణకు దిగినట్లు చెబుతున్నారు. మొత్తం నలుగురు యాత్రికులు అన్నదాన సత్రంలో పని చేస్తున్న బొడ్డుశ్రీను పై దాడి చేసినట్లు గుర్తించారు.

దాడిలో గాయపడ్డ బొడ్డు శ్రీను అన్నదానం మందిరంలోని టేబుల్స్ పైన పడి అక్కడికక్కడే మృతి చెందాడు.

దాడి చేసి పారిపోతున్న నలుగురు వ్యక్తులను శ్రీశైలం పోలీసులు హోంగార్డ్ జయశేఖర్ చేజింగ్ చేసి సున్నిపెంట గ్రామం వద్ద ఇద్దరి నిందితులను పట్టుకున్నాడు.

వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

శ్రీశైలంలోని కాకతీయ కమ్మ సత్రంలోని అన్నదాన మందిరంలో పనిచేస్తున్న బొడ్డు శ్రీనును సత్రం సిబ్బంది  దేవస్థానం హాస్పటల్ కు తరలించగా అప్పటికే మృతి చెతిచెందినట్టు దేవస్థానం డాక్టర్‌లు నిర్దారించారు.

దాడిచేసిన వ్యక్తులు గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన  వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శ్రీశైలం వన్ టౌన్ పోలీసులు తెలిపారు.

Related posts

వైసీపీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ

Satyam NEWS

మల్లంపల్లిని మండలం చేసి జగదీష్ పేరు పెడతాం

Satyam NEWS

కరోనా మృతుల కుటుంబాలకు రూ.15లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment