35.2 C
Hyderabad
April 24, 2024 13: 46 PM
Slider వరంగల్

జంపన్న వాగులో యువకుడి గల్లంతు

#jampannavagu

ములుగు జిల్లా మేడారం జంపన్న వాగు నీటిలో మునిగి యువకుడు గల్లంతు అయిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. సమ్మక్క సారలమ్మ మేడారం జాతర జంపన్న వాగు నీటిలో రాజశేఖర్ ( 26 ) అనే యువకుడు గల్లంతు అయ్యాడు అని స్థానికులు తెలిపారు.

జంపన్న వాగులో యువకుడు గల్లంతు అయిన విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘటన ప్రదేశంని సందర్శించారు. అనంతరం సీతక్క యువసేన మండల అధ్యక్షులు చేర్ప రవీందర్ మాట్లాడుతూ .. టీఆర్ఎస్ నాయకులు స్వార్థంతో కమిషన్ ల కోసం రూ . 12 కోట్ల తో నిర్మించిన చెక్ డ్యామ్ ల వల్ల ఇప్పటి వరకు సుమారుగా 40 మంది చనిపోయారని, మేడారం చుట్టూ 5 గ్రామాలలో చెక్ డ్యామ్ ల వల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు.

చెక్ డ్యామ్ లకు బదులు మేడారం, ఊరట్టం గ్రామ పంచాయతీలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టిస్తే బాగుండేది అని, కేవలం నాయకుల స్వార్థం, కమిషన్స్ కోసం మాత్రమే చెక్ డ్యామ్ లు కట్టారని, ఇప్పటికి అయినా వాటిని తొలగించాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మడప జోగయ్య, గజ్జెల రాజశేఖర్, చేర్ప వీరమోహన్ రావు, గజ్జెల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

జనం సమీకరణ కోసం జనసేన కార్యక్రమం

Satyam NEWS

కొల్లాపూర్ ఎమ్మెల్యే కనిపించడం లేదు

Satyam NEWS

పెన్షన్ విద్రోహ దినం నయవంచన సభ కు భారీగా ఉద్యోగులు….

Satyam NEWS

Leave a Comment