మద్యం మత్తులో అపస్మారకంగా పడివున్న ఓ యువతిని బంజారాహిల్స్ పోలీసులు కాపాడి, స్టేషన్ కు తీసుకురాగా, మెలుకువ వచ్చిన తరువాత ఆమె హల్‌చల్ చేసింది. నిన్న రాత్రి లీసా అనే యువతి రోడ్డుపై పూటుగా మద్యం సేవించి పడి ఉండటాన్ని గమనించిన పోలీసులు, ఆమెను స్టేషన్ కు చేర్చారు. ఆ యువతి పోలీస్ స్టేషన్ నుండి పారిపోయేందుకు ప్రయత్నించగా, మహిళా పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను గట్టిగా పట్టుకుని అదుపు చేసిన పోలీసులు, వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా, అంతు చూస్తానని బెదిరించింది. లీసా నాగాలాండ్ నుంచి వచ్చిందని, మాదాపూర్ ప్రాంతంలోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తోందని పోలీసులు గుర్తించారు. ఇక ఆమె డ్రగ్స్ తీసుకుందా.. లేక మద్యం మత్తులో ఉందా అన్న విషయాన్ని తేల్చేందుకు రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఆపై ఆమె తల్లిదండ్రులను పిలిపించి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.
previous post