విజయనగరంలో అదీ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఉండే ప్రభుత్వ భవన ప్రాంగణమైన జిల్లా కలెక్టరేట్ లో ఇంకా చెప్పాలంటే జాతి పతిగా ఖ్యాతినొందిన మహత్మా గాందీ విగ్రహం వద్ద ఓ పిచ్చోడు కాదు కాదు ఓ అనామకుడు భైఠాయించి సంచలనం రేకెత్తించిన ఘటన “సత్యం న్యూస్.నెట్” కంటపడింది. ఉదయం పద కొండున్నర ప్రాంతంలో కలెక్టరేట్ లో ప్రాంతీయ రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ భద్రతావారోత్సవాల సందర్భంగా పోస్టర్ విడుదల కార్యక్రమం జరుగుతున్న వేళ ఆ అనామకుడు ఒకంత అలజడినే సృష్టించాడు.
తొలుత కలెక్టరేట్ లో ఇన్ గేట్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం ఎదురుగానే భైఠాయించి ఒక రకంగా చెప్పాంటే మౌన దీక్ష లాగే కూర్చున్నాడు.అంతలోనే కలెక్టరేట్ లో పోర్టికో వద్ద ప్రాంతీయ రవాణా శాఖ డిప్యూటీ కమీషనర్ తన సిబ్బందితో జాతీయభద్రతా వారో్త్సవాల పోస్టర్ ను విడుదల చేసే సయమానికి అకస్మాత్ గా వాళ్లకు అడ్డంగా వచ్చాడు.సరిగ్గ ఆక్కడికే జిల్లా పౌర,సమాచార సంబంధాల శాఖ ఇచ్చిన సమాచార మేరకు ఆర్టీఓ కార్యక్రమానికి కవర్ చేసేందుకు మీడియా ప్రతినిధులంతా వచ్చారు.ఇక ఫోటోగ్రాఫర్లు,వీడియో గ్రాఫర్లు కనపడటంతో ఆ వ్యక్తి రెచ్చిపోయాడు.
వచ్చీ రాని ఇంగ్లీష్ తో మాట్లాడారు. ఆర్టీసీ డిప్యూటీ కమీషర్, ఇన్ స్పెక్టర్లు సహితం కాస్సేపు మిన్నకున్నారు. ఆ తర్వాత కలెక్టరేట్ లో ప్రతీ రోజూ వచ్చే పోయే వాహనాల పార్కింగ్ వద్ద భద్రతగా ఉంటున్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులైన ఇద్దరు వచ్చి అతగాడిని లాక్కెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.