38.2 C
Hyderabad
April 25, 2024 12: 16 PM
Slider జాతీయం

60 కిమీ లకు ఒక టోల్‌ప్లాజా

one toll plaza for 60 km

అధిక టోల్‌ప్లాజాలతో సతమతమవుతున్న వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఇప్పటికే పెట్రో ధరలతో వాహనాన్ని రోడ్డెక్కించేందుకు వణుకుతున్న వాహనదారులు, అడుగుడగునా ఏర్పాటు చేసిన టోల్ ప్లాజాల వద్ద టోల్ చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో టోల్ సమస్యలను కొంతలో కొంత తగ్గించేందుకు రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక నిర్ణయం తీసుకున్నారు.

హైవేలపై 60 కి.మీల పరిధిలో ఒకే టోల్ ప్లాజా ఉండేట్లు చర్యలు తీసుకుంటామని  పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి తెలిపారు. ఒకవేళ 60 కి.మీల పరిధిలో రెండు, అంతకంటే ఎక్కువ టోల్ ప్లాజాలు ఉన్నట్లైతే మూడు నెలల్లోనే వాటిని మూసివేసి,  ఏడాదిలోపు వాటిని పూర్తిగా తొలగిస్తామని చెప్పారు. అలాగే అమెరికా లాంటి దేశాలు రోడ్ల అభివృద్ది వల్లే పురోగతి సాధించయని చెప్పారు. 2024 చివరినాటికి దేశంలోని రోడ్లను అమెరికా రోడ్లలా మారుస్తామని ఆయన ప్రకటించారు.

Related posts

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ నేతల శుభాకాంక్షలు

Satyam NEWS

పేద ప్రజల ఇండ్ల పట్టాలను తిరిగి ఇవ్వాలి

Bhavani

అంతర్వేదిలో ఏపీ మంత్రులకు చేదు అనుభవం

Satyam NEWS

Leave a Comment