Slider ప్రత్యేకం

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సజీవ దహనం?

fire on women

పోలీసు స్టేషన్ ఆవరణలోనే ఒక మహిళ నిప్పంటించుకున్నది. ఈ దుర్ఘటన హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగింది. లోకేశ్వరి అనే మహిళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వచ్చి అకస్మాత్తుగా వంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులు మరు క్షణంలోనే అప్రమత్తమై మంటలు ఆర్పివేశారు.

మంటలు ఆర్పేసిన పోలీసులు పక్కనే ఉన్న నిమ్స్‌ ఆస్పత్రికి ఆమెను తరలించారు. మోడల్‌ పీఎస్‌లోనే ఈ ఘటన జరగడంతో ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు. అయితే ఆమె పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. లోకేశ్వరి ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారనే విషయాలు తెలియాల్సి ఉంది.

Related posts

ఓపెన్ లెటర్: వివేకవంతుడైన ఒక ముస్లిం ఆవేదన

Satyam NEWS

ప్రభుత్వ పాఠశాల  విద్యార్థులతో ఎస్పీ సహపంక్తి భోజనం

Satyam NEWS

కోర్టు రికార్డుల డిజిటలైజేషన్ కు చర్యలు

mamatha

Leave a Comment

error: Content is protected !!