30.2 C
Hyderabad
October 13, 2024 17: 02 PM
Slider సంపాదకీయం

ప్రజాబందీని అక్రమంగా బందీనిచేసిన వార్షికోద్వేగం

#chandrababu

తొమ్మిది రోజులుగా చంద్రబాబు విజయవాడ కలెక్టరు కార్యాలయంలో తనకు తాను బందీలా వున్నారు. బంధువు బావమరిది, వియ్యంకుడు బాలక్రిష్ణ 50 ఏళ్ల సినీ వార్షికోత్సవానికి హైదరాబాదు వెళ్లలేదు ఆ ప్రజాబంధువు. వినాయక చవితి రోజున ఇంటికి వెళ్లక ఆపదలో వున్న ప్రజల కోసం అక్కడే పూజలు చేశాడు ఆ ఆపద్బాంధవుడు. నిన్న ఆయన వివాహ వార్షికోత్సవానికి అక్కడి నుండి కనీసం కరకట్ట వద్ద ఇంటికి కూడా వెళ్లి రాలేదు, ఆ ప్రజా కుటుంబ పెద్ద. ఆయన అక్కడి నుండి కదిలితే సహాయక చర్యలు ఆగిపోవచ్చు.

అవతల లక్షలాది మంది జనం ఇబ్బందుల్లో వున్నారు. అందుకే అక్కడ తనకు తాను ప్రజా బందీలా వున్నారు. తనను ఏడాది క్రితం ఇదే రోజు అక్రమంగా అరెస్ట్ చేసి బందీని చేసి రాజమండ్రి జైల్లో పెట్టారు. ఆయన రాజకీయ జీవితంలో 53 రోజులపాటు టీవీల్లో అయినా జనానికి కనిపించకుండా వుండింది లేదు. అన్ని రోజులు ఆయనను చూడకుండా.. జైల్లో ఎలా వున్నాడో అని తల్లడిల్లిన జనం, ఆయన బెయిలు మీద వచ్చిన రోజు తండోపతండాలుగా వస్తే.. జైలు నుండి రాజమండ్రి బయటకు రావడానికి గంటలు పట్టాయి.

రెండు గంటల్లో విజయవాడకు రావాల్సిన ఆయనకు ఒక రోజంతా పట్టింది. ఇటు విజయవాడలో ఆయన వచ్చే రోడ్ల వారన రాత్రంతా శివరాత్రిలా.. వైకుంఠ ఏకాదశిలా జాగారం చేస్తూ.. అక్కడే పడుకొన్నారు, జనం. మరుసటి రోజు పొద్దున ఆ దారిలో ఆయన వస్తుంటే అడ్డంపడుతూ తనివితీరా చూసుకొని కానీ జనం కదలలేదు. అందుకే ఆ ప్రజాబంధువు చంద్రబాబు, ముంపుప్రాంతాలలో తిరుగుతూ కలెక్టర్ కార్యాలయం బందీలా వున్నారు, 9 రోజులుగా. తనను అక్రమంగా అరెస్టు చెయ్యక ముందే.. తనను జగన్ అక్రమంగా అరెస్టు చెయ్యబోతున్నాడు అని చంద్రబాబు మీడియా ద్వారా ప్రజల్లో వున్నప్పుడే చెప్పాడు.

అంతా ఆశ్చర్యపోయారు. అంతపని ఎందుకు చేస్తారు అని నమ్మలేదు. కానీ సిఎం హోదాలో డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ జగనుకు వున్నా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు దేశం దాటి వెళ్లలేడు. సీబీఐ అనుమతి తీసుకొనే వెళ్లాలి. అలాంటి అనుమతి ముందే తీసుకొని, చంద్రబాబు అరెస్టు సమయంలో దేశంలో లేకుండా లండనుకెళ్లాడు జగన్. తన గురించి ఆవేశపడకుండా, సంయమనం పాటించి సహకరించండి అని ఒక సందేశం ఇస్తూ.. జైలులోకి వెళ్లాడు జగన్ కక్ష సాంధింపులకు బందీగా.. చంద్రబాబు. పదుల సంఖ్యలో గుండెలు ఆగిపోయాయి.

ఆ అరెస్టుకు తల్లడిల్లుతూ అభిమానంతో గుండెలు పగిలి మరణించారు. ఆంధ్రా అంతటా భావోద్వేగాలు. మండిపోతున్న ఎండల్లో.. జైల్లో కూడా ఆ బందీకి ఇబ్బందులు పెడుతుంటే.. మరోవైపు ఇటీవలే వైకాపా ప్రధాన కార్యదర్శి పదవిని జగను తనకు ఇచ్చ్హి రుణం తీర్చుకొన్న అప్పటి ఏఏజి పొన్నవోలు సుధార్ రెడ్డి ఢిల్లీలో మీడియా సమావేశాలు పెట్టి అబద్దాలను ప్రచారం చేస్తుంటే.. జనం రగిలిపోయారు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి తెలుగు వాడూ ఆక్రోశిస్తూ నిరసన తెలిపాడు. హైదరాబాదు గచ్చిబౌలి స్టేడియంలో వేలాది మంది వచ్చి గంభీరంగా నిరశన తెలిపారు. ఆయనకోసం హైటెక్ సిటీలో నిరసనలు ఏంటన్న పాలకులను పదవిలో నుండి ఈడ్చిపడేసేంత పగతో రగిలిపోయారు పొరుగున వున్న సాటి తెలుగు జనం కూడా. అవినీతికి పాల్పడ్డాడని ఒక రాజకీయ నాయకుడిని అరెస్టు చేస్తే.. ఆయనకు శిక్ష పడాల్సిందే అనే సందేశాలు వినిపిస్తారు ప్రపంచంలో. కానీ ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖుల నుండి సామాన్యుల వరకు ఖండించారు, అన్ని రాజకీయ పార్టీలు ఆయనను అక్రమంగా అరెస్టు చేశారని ఖండించాయి.

ఆయన బయటకు రావాలని, భగవంతుని కోరుకొంటున్నామని ప్రార్థనలు చేశారు. బహుశా ప్రపంచంలో ఒక్క చంద్రబాబు నాయుడికే ఆ అభిమానం, అంత నమ్మకం దక్కిందనవచ్చు. గవర్నర్ అనుమతి కూడా లేని ఆ అక్రమ అరెస్టు మీద న్యాయస్థానాల్లో పోరాడి, బెయిలు మీద బయటకు వచ్చిన ఆయన ఎండ, వాన చూడకుండా ప్రజల్లోకి వెళ్లాడు. మండుటెండల్లో ఆయన గంటకు పైగా ప్రసంగించినా.. చమటలు పోస్తున్నా.. దాహం వేస్తున్నా.. జనం మండే గుండెలతో ఆయన మాటలు ఆలకించారు కదలకుండా. వర్షంలో తడిసి ముద్దవుతూ.. ఆయన ప్రసంగిస్తున్నా.. తడుస్తూ జనం విన్నారు.

అక్రమ అరెస్టులను భరించక తనువు చాలించిన కుటుంబాలకు తానున్నా అనే ధైర్యం ఇస్తూ.. ఆయన అర్థాంగి భువనేశ్వరి కూడా నిజమే గెలవాలని కోరింది. నాయుడు చలించిపోయాడు తన మీద ప్రపంచం పెట్టిన నమ్మకం, అభిమానాలకు. ప్రజలు ఇచ్చిన ఏక ప్రక్ష తీర్పు దేశ చరిత్రలో నిలిచిపోతుంది. ఆ నమ్మకం, ఆ అభిమానం వెలకట్టలేనిది. దానిని నిలబెట్టుకోవాలి అంటే బందీగా కూడా కష్టపడాల్సిందే.

ఈ రోజుకూ అదే కష్టం ఆయన చేస్తూనే వున్నాడు ఇష్టంగా. ఆయన విషయంలో ఎన్ని అబద్దాలు చెప్పినా.. ఆడినా.. వారే బలవుతున్నారు. నేడు లండను వెళ్లడానికో, పారిపోవడానికో పాస్‌పోర్ట్ రెన్యువల్ కోసం జగనుకు కోర్టుకు వెళ్లే కర్మ పట్టింది. మొహాల్లో బాధ బదులు చిరునవ్వు వచ్చే వరకు బందీగా వుంటున్న బాబు, దీనినో పరీక్షగా భావిస్తూ.. భవిష్యత్తులో మళ్లీ ఈ వరద రాకుండా చేస్తానని ఇచ్చిన హామీ.. నమ్మకంగా మారి ధైర్యమైంది విజయవాడ నగరానికే. అక్రమంగా అరెస్టు అయ్యి బహుశా ఆయన బందీగా గడిపిన 53 రోజులే, ఆయన శరీరానికి కొంత విశ్రాంతిని ఇచ్చిందేమో ఈ ప్రజాబందీ రాజకీయ జీవితంలో.

Related posts

కంటి ఆపరేషన్లు చేసుకున్న వారిని పరామర్శించిన మంత్రి రోజా

Satyam NEWS

రాష్ట్రంలో ఉన్మాద పాలన టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి

Sub Editor

జాతర

Satyam NEWS

Leave a Comment