డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో చమురు సహజవాయుల సంస్థ కార్యక లాపాలు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో కార్పొ రేట్ సామాజిక బాధ్యత నిధులతో గ్రామాల అభివృద్ధికి ఇతోదికంగా ఆర్థిక సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ongc అధికారు లను కోరారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ గారి ఛాంబర్ నందు చమురు సహజ వాయువులు సంస్థ తూర్పు ప్రాంత ఆఫ్ సోర్ ఎసెట్ కాకినాడ ప్రతిని ధులు జిల్లా పంచాయతీ అధికారి సిపిఓ లతో సమావేశం నిర్వహించి ఓడల రేవు తదితర ప్రాంతాలలో మూడు క్లస్టర్ల ద్వారా నిర్వహిస్తున్న కార్యకలాపాలను ఓఎన్జిసి ప్రతిని ధులు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భం గా ఓఎన్జిసి అధికారులు ముడి చమురు, గ్యాస్, నీటి విభజన విధానం పైప్ లైన్ భద్రత గోదావరి బేసిన్లో చమురు సహజ వాయువులు డ్రిల్లింగ్ ద్వారా వెలికితీత, డ్రిల్లింగ్ సమయంలో ఆ ప్రాంతంలో చేపల వేట కోల్పోయిన మత్స్య కారులకు జీవనభృతి అందించడం, కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు కేటాయింపు, తదితర అంశాలను విశదీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు విధి విధానాల పరంగా విడుదల చేస్తూ నిక్షేపాలు వినియోగించుకుంటున్న చము రు సంస్థలు ఈ ప్రాంత అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పనలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు
ఈనెల 30వ తేదీ ఉదయం 10 గంటలకు చము రు, సహజవాయుల సంస్థ (ఓఎన్జిసి) వారి కార్యకలాపాలపై జిల్లా కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా పంచాయితీ అధికారి, ఓఎన్జిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వ హించి కార్పోరేట్ సామాజిక బాధ్యత (సి ఎస్ ఆర్) నిధులు కేటా యింపు అంశాలపై క్షుణ్ణంగా చర్చిం చడం జరుగుతుందని తెలిపారు. ఓఎన్జిసి చమురు నిక్షేపాలు వెలికి తీస్తున్న గ్రామాల జాబితాను సిద్ధం చేసి గ్రామాభి వృద్ధికి స్థానిక ప్రజల డిమాండ్ అంశాలను సమర్పించాలని జిల్లా పంచాయితీ అధికారిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో చమురు సహజ వాయుల సంస్థ ఎస్టేట్ మేనేజరు కార్యనిర్వాహక సంచాలకులు రత్నెస్ కుమార్, సీజీఎం మెకానికల్ నిర్మల్ కుమార్, హెడ్ హెచ్ ఎస్ సి మేనేజర్ భాస్కరరావు, హెచ్ ఆర్ హెడ్ సునీల్ కుమార్ ,ప్రొడక్షన్ జనరల్ మేనేజర్ ఏ గుప్తా, ప్రొడక్షన్ సూపరిం టెండెంట్ ఇంజనీర్ మురుగవెల్, సీనియర్ హెచ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ సాదా భన్వర్, ఫణీంద్ర నరేంద్ర, సిపిఓ వెంకటేశ్వర్లు జిల్లా పంచాయతీ అధికారి డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.