36.2 C
Hyderabad
April 25, 2024 19: 28 PM
Slider ముఖ్యంశాలు

ఫస్ట్ నుంచి పంతుళ్ల కు పరేషాన్ మొదలు

#Online Class

సెప్టెంబర్ ఒకటవ తారీఖు నుండి  కచ్చితంగా ఆన్లైన్ విద్యాబోధన విద్యార్థులకు బోధించే విషయంలో పంతుళ్ళు పరేషానా అని పలువురు గుసగుసలాడుతున్నారు. కరోనా నేపథ్యంలో లాక్ డాన్ సందర్భంగా దాదాపు ఐదు నెలల తర్వాత సెప్టెంబర్ ఒకటవ తారీఖు నుండి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి.

2020 -21 విద్యా సంవత్సరానికి నేటినుంచి ఉపాధ్యాయులు విధులకు హాజరు కానున్నారు సుదీర్ఘ  సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి విద్యార్థులకు ఆన్లైన్లో తరగతులు బోధించడానికి సరైన వసతులు ఏర్పాట్లు చేయడానికి గురువారం నుంచి ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరు కావాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

ఈ నేపథ్యంలో పలువురు పంతుళ్లు పరేషాన్ గా ఉన్నట్లు పలువురు గుసగుసలు మాట్లాడుకుంటున్నారు. కరోనా రాకమునుపు పాఠశాల విద్యా బోధన నాలుగు గోడల మధ్య ఎలా జరిగిందో ఎవరికీ తెలియదు. వారికి వచ్చినట్లు బోధించేవారు.

పాఠశాలకు గైర్హాజరు అయ్యి కూడా వారి హాజరు పట్టికలో హాజరైనట్లు సంతకాలు చేసుకునేవారు. వారి ఇష్టానుసారం ప్రవర్తించేవారు. కొన్ని సోషల్ మీడియాలో తప్పులతడకలతో విద్యాబోధన చేసినట్లు వీడియోలు దర్శనమిచ్చాయి. అదేవిధంగా పాఠశాల తరగతి గదులలో నిద్రించినట్లు కూడా ఆ వీడియోలు ఉన్నాయి.

కాగా ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్లైన్ బోధన ద్వారా వాళ్ళ బ్రతుకు బయటపడుతుందని పలువురు పంతుళ్ళు పరేషాన్ అవుతున్నట్లు పట్టణ ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఆన్ లైన్ ద్వారా ఉపాధ్యాయులు వారి బోధనను విద్యార్థుల తల్లిదండ్రులు కాక అందరూ వీక్షిస్తారాని తమ తప్పులు ఎక్కడ గుర్తిస్తారోనని అదే విధంగా క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావాల్సి వస్తుందని తమ వ్యాపారాలు కూడా దెబ్బతింటాయని పలువురు పంతుళ్లు పరేషాన్ అవుతున్నట్లు కొందరు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

చాలావరకు ఉపాధ్యాయులు పట్టణాలలో ఒకవైపు ఉద్యోగం చేస్తూ గతంలో చిట్టీలు రోజువారి అప్పు వసూళ్లు చేసుకునే వారు కాగా ఇప్పుడు అలా వీలు పడుతుందో పడదెమోనని వారి వ్యాపారాలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు నగరవాసులు మాట్లాడుకుంటున్నారు.

మొత్తం మీద కరోనాకొందరి ప్రాణాలు తీస్తున్న ఏదోవిధంగా మరికొందరికి మంచి గుణపాఠం చెబుతుంది అనే చెప్పుకోవాలి. ఫస్ట్ నుంచి ఎంతమంది పంతుళ్ళు పరేషాన్ అవుతారో వేచి చూడాల్సిందే.

Related posts

కేసీఆర్ కుటుంబ పాలన కు చరమగీతం పాడాలి

Satyam NEWS

మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేయండి

Satyam NEWS

వైఎస్సార్ టిపి జహీరాబాద్ పార్లమెంట్ ఇంఛార్జ్ గా బోరికి సంజీవ్

Satyam NEWS

Leave a Comment