28.7 C
Hyderabad
April 20, 2024 10: 11 AM
Slider వరంగల్

ఆన్ లైన్ క్లాస్ లపై సెక్టోరియల్ అధికారి తనిఖీలు

#SectorialOfficer

ఆన్ లైన్ క్లాస్ లు ఎలా నడుస్తున్నాయి? ఈ విషయాన్ని పరిశీలించేందుకు ములుగు జిల్లా సెక్టోరియల్ అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి ఉద్యుక్తమయ్యారు.

నేడు ఆయన ములుగు మండలంలోని కోయగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్, రామచంద్రపురం MPPS, గుర్తురు తండా MPPS, రహీం నగర్ తండా MPPS, BVN తండా MPPS, జాకారమ్ MPPS లను సందర్శించారు.

ఆన్ లైన్ పాఠాలు ఏ విధంగా నడుస్తున్నాయనే అంశాన్ని ఆయన పరిశీలించారు. పాఠశాల కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా ఉందో ఆయన పరిశీలించారు. దూర దర్శన్, T-Sat ఛానల్ టైంటేబుల్ ను ఆయన పరిశీలించారు.

whats app గ్రూప్ ల ద్వారా విద్యార్థులకు work sheets ఇస్తున్న వారికి అభినందనలు తెలిపారు. ప్రతీ విద్యార్థి పై వ్యక్తి గత శ్రద్ధ వహించి పర్యవేక్షణ చేస్తున్నందుకు అభినందనలు చెప్పారు.

ఆన్ లైన్ పాఠాల పై తల్లి తండ్రుల అభిప్రాయం తెలుసుకున్నారు. విద్యార్థుల కు ఈ పాఠాలు చాలా ఉపయోగం అవుతున్నాయి అని, సమయం వృధా చేయకుండా పిల్లలు TV ల ముందు సమయం ప్రకారం కూర్చునేల తామే బాధ్యత తీసుకుంటామని తల్లి తండ్రులు చెప్పారు.

Related posts

మురుగుపారు…పశువులు సేద తీరు…

Bhavani

లద్దాక్ పై మళ్లీ మొదలైన భారత్ చైనా సైనికాధికారుల చర్చలు

Satyam NEWS

జనసేన అధినేత రాకకై విజయనగరం లో ఎదురు చూపులు…!

Satyam NEWS

Leave a Comment