28.2 C
Hyderabad
April 20, 2024 12: 23 PM
Slider వరంగల్

బాలలపై లైంగిక వేధింపులు చేయడం నేరం

#ChileEducation

ఆన్లైన్ తరగతులు నిర్వహించడం వలన, సామాజిక మాధ్యమాలైన వాట్సప్, ఫేస్ బుక్ విచ్చలవిడిగా  ఉపయోగించడం వల్ల పిల్లలు వేధింపులకు గురి అవుతున్నారని ములుగు జిల్లా బాలల సంరక్షణ అధికారి జె.ఓంకార్ అన్నారు. బండారుపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల లో ఐసిడిఎస్ అంగన్వాడీ టీచర్లు, జిల్లా బాలల సంరక్షణ విభాగం సంయుక్తంగా లైంగిక వేధింపులు, బాలల హక్కుల సంరక్షణ అనే అంశం పై అవగాహన కార్యక్రమం చేపట్టింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఓంకార్ మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలలు మూసి వేయడం వల్ల ఆన్ లైన్ క్లాసులకు విద్యార్ధులు హాజరవుతున్నారని ఆయన అన్నారు. ఇంటర్నెట్ వినియోగం వల్ల బాలలు అనేక వేధింపులకు గురి అవుతున్నారని ఆయన అన్నారు.

ఈ క్రమంలోనే బాలలు తను తాము రక్షించుకోవాలని, చెడు వ్యసనాలకు గురి కాకూడదని ఆయన అన్నారు. కిషోర బాలలకు లైంగిక నేరాల నుండి బాలల రక్షణ చట్టం 2012, పోక్సో గురించి వివరిస్తూ వివిధ రకాల బాలల లైంగిక వేధింపుల గురించి వివరించారు.

18 సంవత్సరాలలోపు బాలలకు సురక్షిత /ఆసురక్షిత స్పర్శ గురించి పూర్తిగా అవగాహన కల్పిస్తూ ఏది మంచి ఏది చెడు అనే విషయాన్ని నిర్ణయించుకుని ఉండాలని అప్పుడే వేధింపుల గురించి పెద్దలకు తల్లిదండ్రులకు  సమాచారం ఇవ్వగలరు. అందుకని ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని  వివరించారు.

అదేవిధంగా  ఐ సి పి ఎస్  సోషల్ వర్కర్ జ్యోతి మాట్లాడుతూ బాల్య వివాహాలు, బాలకార్మికులు, అనాథ బాలలు సంబంధించిన సమస్యలపై వివరించారు. గ్రామంలో 18 సంవత్సరాల లోపు పిల్లలు పని చేయకూడదని ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం ప్రకారం 14 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలు బడిలోనే ఉండాలని  తెలియజేశారు. 

చైల్డ్ లైన్ నెంబర్ 1098  కు నేరుగా ఫోన్ ద్వారా సమాచారం  అందించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ P. రవి, B. సునీత  ఐసిపిస్ సోషల్ వర్కర్ జ్యోతి,  ఔట్ రీచ్ వర్కర్ రాజు, అంగన్వాడి టీచర్స్  రాజ్యలక్ష్మి, బి వినోద, పి కవిత, సత్యనారాయనమ్మ ANM, ఉషా ANM, ఆశ వర్కర్లు మంజుల, వాణి, రమ, మరియు 40 మంది కిషోర బాలలు  పాల్గొన్నారు.

Related posts

తిరుమలలో డిక్లరేషన్ విధానాన్ని ఎత్తేయాల్సిందే

Satyam NEWS

ప్రజాసమస్యల పరిష్కారానికే ప్రధమ ప్రాధాన్యం

Satyam NEWS

సెల్లి చంద్రమ్మ బోనమెత్తింది..

Satyam NEWS

Leave a Comment