39.2 C
Hyderabad
March 28, 2024 15: 36 PM
Slider నల్గొండ

ఆన్ లైన్ తరగతులు తల్లిదండ్రులకు భారమే

#On line survey

ఆన్ లైన్ లో తరగతుల నిర్వహణ గ్రామీణ ప్రాంతాల్లో సాధ్యం కాదని అది పిల్లల మానసిక శారీరక ఎదుగుదల పై తీవ్ర ఒత్తిడి చూపిస్తుందని తల్లిదండ్రులకు భారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్ లైన్ లో తరగతుల నిర్వహణ పై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ అభిప్రాయ సేకరణ చేసింది.

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మండలంలోని వట్టిమర్తి, వనిపాకల, చిట్యాల,శివనేని గూడెం,ఉరుమడ్ల, నేరడ  గ్రామాలలో 180 కుటుంబాల నుంచి అభిప్రాయసేకరణ జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో కోవిడ్ 19 తక్కువగా ఉన్నందువలన నిబంధనలు పాటిస్తూ విద్యార్థుల రక్షణ చర్యలు చేపడితే పాఠశాలలను ప్రారంభిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో  జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు కొత్తపల్లి మల్లేశం చిట్యాల మండల శాఖ అధ్యక్షులు పగిడిపాటి నరసింహ ప్రధాన కార్యదర్శి ఏశమల్ల నాగయ్య పాల్గొన్నారు.

Related posts

ఆడ‌బిడ్డ‌ల‌కు బ‌తుక‌మ్మ చీర‌లు పంపిణీ చేసిన ఎర్రబెల్లి

Satyam NEWS

పెంచిన ఆర్టీసీ బస్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి

Satyam NEWS

పొలం వాకిట్లోకి సాగునీళ్లు…. ఇంటి పోయికాడికే తాగునీళ్లు

Satyam NEWS

Leave a Comment