37.2 C
Hyderabad
March 28, 2024 17: 41 PM
Slider వరంగల్

ఆన్లైన్ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

#MuluguDEO

ప్రతి విద్యార్థి ఆన్లైన్ పాఠాలు వీక్షించేలా ఉపాధ్యాయులందరూ పర్యవేక్షించాలని, విద్యార్థులందరికీ పాఠ్యాంశాల  షెడ్యూల్ ని అందజేయాలని ములుగు డిఇఓ డి.వాసంతి కోరారు.

ఆన్లైన్ తరగతుల పర్యవేక్షణ లో భాగంగా బుధవారం నాడు తాడ్వాయి మండలం లోని ZPHS కాటాపూర్ పాఠశాలను సందర్శించారు. అనంతరం విద్యార్థుల ఇంటికి వెళ్ళి పాఠాలు టీ.వి లో వీక్షించడాన్ని పరిశీలించారు.

విద్యార్థులతో పాఠ్యాంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా డి ఇ ఓ వాసంతి మాట్లాడుతూ ఆన్లైన్ పాఠాలు వినేందుకు ఎలక్ట్రానిక్ పరికరాలు లేని విద్యార్థులను గుర్తించి వారి దగ్గర లో ఉన్న విద్యార్థుల వద్దకు వెళ్లి చూసేలా  మ్యాపింగ్ చేయాలని సూచించారు.

ఉపాధ్యాయులు ప్రతిరోజు మూల్యాంకనం చేసి విద్యార్థులకు అందించే వాటిని  రికార్డులలో నమోదు చేయాలని, ఆన్లైన్ పాఠాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డిఇఓ హెచ్చరించారు.

Related posts

రన్ ఫర్ గర్ల్ చైల్డ్: బాలికలను రక్షించండి ప్లీజ్

Satyam NEWS

సీఎం మార్పు లేదు: నేనే సిఎంగా ఉంటా

Satyam NEWS

సీఎం సభలో రాజధాని కోసం నల్ల జెండాలు, నల్ల బెలూన్లు

Satyam NEWS

Leave a Comment