35.2 C
Hyderabad
April 20, 2024 15: 44 PM
Slider ముఖ్యంశాలు

లాక్ డౌన్ వేళ ఐఐటీ-జేఈఈ, నీట్ ఆన్ లైన్ మాక్ టెస్టులు

iit jee

ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ సమయంలో విద్యార్ధులు విలువైన సమయం వృధా చేసుకోకుండా ఆన్ లైన్ లో మాక్ టెస్టులను అటెండ్ కావచ్చునని  ఐఐటీ-జేఈఈ ఫోరం, నీట్ ఫోరం కన్వీనర్ కె. లలిత్ కుమార్ తెలిపారు. ఇందుకోసం ఆన్ లైన్ ద్వారా ఉచితంగా  ఐఐటీ-జేఈఈ, నీట్ మోడల్, మోక్ టెస్ట్స్ పేపర్లు ఉన్నాయని ఆయన అన్నారు.

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటి వద్ద ఉన్న విద్యార్థుల ప్రిపరషన్, ప్రాక్టీస్ కోసం  ఐఐటీ-జేఈఈ ఫోరం ప్రముఖ ఐఐటీ, నీట్  శిక్షణా సంస్థలు సంయుక్తంగా ఈ ఆన్ లైన్ మాక్ టెస్టులు రూపొందించిందని లలిత్ కుమార్ తెలిపారు.  జేఈఈ, నీట్ మోడల్, మోక్ టెస్ట్స్ ను ఆన్ లైన్ లో  విద్యార్థుల కు ఉచితంగా అందచేస్తున్నట్లు ఐఐటీ -జేఈఈ/నీట్ ఫోరం కన్వీనర్ కె. లలిత్ కుమార్ తెలిపారు.

ఔత్సాహిక విద్యార్థుల అవగాహన కోసం మొబైల్ వెర్షన్ ద్వారా ఆన్ లైన్ లింక్ ను వాట్సాప్ ద్వారా రేపటి నుండి  నుండి  అందిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు 98490 16661 కు ‘ Online Test ‘ అని టైప్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయాల్సిందిగా ఆయన కోరారు.

Related posts

భారతీయ సాంప్రదాయానికి ప్రతీక రాఖీ పండుగ

Satyam NEWS

(Free|Trial) Thermocarb Weight Loss Pills Coffee Bean Weight Loss Pill Reviews Medi Weight Loss Diet Pills

Bhavani

కామారెడ్డి విశ్వకర్మ కార్పెంటర్ అసోసియేషన్ ఎన్నిక

Bhavani

Leave a Comment