26.7 C
Hyderabad
June 22, 2024 04: 50 AM
Slider ప్రత్యేకం

రాష్ట్రాన్నే కాదు ఏబీ కెరియర్ నూ నాశనం చేసిన జగన్

#abvenkateswararao

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును, అమరావతిని నాశనం చేసినట్లే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఐదేళ్ల కాలంలో సీనియర్ IPS అధికారి AB వెంకటేశ్వరరావు కెరియర్ ను కూడా నాశనం చేశారు. జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇచ్చిన రెండో జీవో లోనే AB వెంకటేశ్వర రావు పోస్టింగ్ తొలగిస్తూ ఉత్తర్వులు ఉన్నాయి. ఆ నాటి నుంచి వెంకటేశ్వరరావు జగన్ ప్రభుత్వ నిర్ణయం పై పోరాడుతూనే ఉన్నారు. రిటైర్మెంట్ కు ఇంకా కేవలం 4 రోజులే సమయం ఉండడం తో ఈ విషయంపై సర్వత్రా చర్చ జరుగుతున్నది.

యూనిఫాంతో,  పోస్టింగ్ లో ఉండి రిటైర్మెంట్ తీసుకోవాలన్న పట్టుదలతో పోరాడుతున్న సీనియర్ IPS అధికారి AB వెంకటేశ్వరరావును అన్యాయంగా జగన్ ప్రభుత్వం అడ్డుకుంటూనే ఉన్నది. జగన్ ప్రమాణ స్వీకారం చేసిన 2019 మే 30 నుంచి వెంకటేశ్వరరావు కు పోస్టింగ్ ఇవ్వలేదు. పైగా అన్యాయమైన ఆరోపణలతో జగన్ రెడ్డి సస్పెండ్ చేయించాడు. AB వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను రద్దు చేస్తూ ఈ నెల 8 న క్యాట్ తీర్పు ఇచ్చింది. క్యాట్ తీర్పు అనంతరం కూడా పోస్టింగ్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వ కుట్రలు కొనసాగించింది. క్యాట్ తీర్పును నిలుపుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా హై కోర్ట్ కు వెళ్ళింది.

చివరి రోజు వరకు పోస్టింగ్ దక్కకుండా చూసే సీఎం జగన్ రెడ్డి  కుట్రలో భాగస్వామిగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మారారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కోర్ట్ లో నాలుగు రోజుల క్రితం ఇరు వర్గాల వాదనలు పూర్తి కాగా ద్విసభ్య ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. ఆయన రిటైర్మెంట్ కు ఇంకా కేవలం 4 రోజులే గడువు ఉండడంతో కోర్ట్ తీర్పు, ప్రభుత్వ తదుపరి చర్యలపై అన్ని వర్గాల్లో చర్చ, ఉత్కంఠ రేకెత్తుతోంది.

Related posts

సంబంధంలేని విషయంలో జర్నలిస్టు భూమేష్ నే వేధిస్తున్న పోలీసులు

Satyam NEWS

అవాకులు చవాకులు పేలుతున్నారు జాగ్రత్త

Satyam NEWS

ప్రశాంత డెల్టా ప్రాంతంలో వైసీపీ దాడులు

Satyam NEWS

Leave a Comment