24 C
Hyderabad
June 19, 2021 09: 10 AM
Slider విజయనగరం

అత్యవసర అవసరాలకు మాత్రమే ఈ-పాస్ కు దరఖాస్తు చెయ్యండి…!

#RajakumariIPS

విజయనగరం జిల్లాలో కర్ఫ్యూ అమలయ్యే సమయంలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే తప్పని సరిగా ఈ-పాస్ కావాలని జిల్లా ఎస్పీ రాజకుమారి అన్నారు. కర్ఫ్యూ సడలింపు సమయంలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళేందుకు అనుమతించినా, కర్ఫ్యూ అమలయ్యే మద్యాహ్నం 12 గంటల నుండి బయటకు రావాలంటే తప్పని సరిగా ఈ-పాస్ ఉండాలన్నారు.

అత్యవసర వైద్య సేవలు, శుభ కార్యక్రమాలు, అంత్యక్రియలకు వెళ్ళేందుకు మాత్రమే ఈ-పాస్ కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ-పాస్ కు దరఖాస్తు చేసుకొనేవారు appolice.gov.in వెబ్ సైట్ లోకి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

వెబ్ సైట్ లోకి వెళ్ళిన తరువాత “ఈ-పాస్ ఫర్ మూవ్మెంట్ డ్యూరింగు లాక్ డౌన్” పైన క్లిక్ చేస్తే, దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుందన్నారు. అవసరమైన వివరాలును దరఖాస్తు ఫారంలో నమోదు చేస్తే, వాటి ఆధారంగా దరఖాస్తుదారుని వాట్సాప్ నంబరు, ఈ-మెయిల్ కు పాస్ కు సంబందించిన లింకు డీజీపీ కార్యాలయం నుండి పంపుతారని, లింక్ ను ఓపెన్ చేస్తే ఈ-పాస్ డౌన్ లోడు అవుతుందన్నారు.

అత్యవస పరిస్థితుల్లో ప్రయాణం చేయాలనుకున్న వారు మాత్రమే ఈ-పాస్ కు దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు వివరాలను పరిశీలించి, ఆమోదయోగ్యంగా ఉన్న దరఖాస్తుదారులకు మాత్రమే ఈ-పాస్ ను డీజీపీ ఆఫీస్ మంజూరు చేస్తుందని జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు.

కర్వ్యూ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవు

కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రాజకుమారి హెచ్చరించారు. కర్ఫ్యూ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వారి పై డిజాస్టర్ మేనేజ్ మెంట్, ఎపిడిమిక్ డిసీజెస్ చట్టం ప్రకారం కేసులు తప్పవన్నారు.

కర్ఫ్యూ సడలింపు సమయం ఉదయం 6 గంటల నుండి మద్యాహ్నం 12 గంటలకు వరకు మాత్రమే ప్రజలు తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకోవాలన్నారు. ప్రజలు  ఒక్కసారిగా షాపుల వద్ద గుమిగూడి కొనుగోళ్ళుకు వెళ్ళవద్దని, వ్యక్తుల మధ్య సోషల్ డిస్టెన్స్ పాటించాలని, బయటకు వచ్చే సమయంలో డబుల్ మాస్క్ లు ధరించాలన్నారు.

ప్రజలకు కరోనా నియంత్రణ పట్ల అవగాహన కల్పించేందుకు కరోనా అవగాహన బృందాలను ఏర్పాటు చేసామన్నారు. ముఖ్య కూడళ్ళలో లఘు చిత్రాలను, ప్ల కార్డులను ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

ప్రజలందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి, కరోనా నియంత్రణకు పోలీసు వారి సూచనలను పాటిస్తూ, కరోనా నియంత్రణకు సహకరించాలన్నారు. వ్యాధి ప్రబలకుండా ప్రతీ పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే, కరోనాను నియంత్రించవచ్చునని ఎస్పీ రాజకుమారి అన్నారు.

Related posts

పేరుకే ప్రశాంతి… బిల్డర్ల పాలిట పెను అశాంతి

Satyam NEWS

వైభవంగా రాధా కృష్ణుల శోభాయాత్ర ప్రారంభం

Satyam NEWS

న్యాయ వ్యవస్థపై దుష్ప్రచారం ప్రభుత్వానికే నష్టం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!