28.2 C
Hyderabad
April 20, 2024 12: 17 PM
Slider ఆంధ్రప్రదేశ్

ఈ సారి రేషన్ లో కందిపప్పు ఇవ్వడం లేదు

#YSJaganmohanReddy

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు రేషన్ సరకులలో బియ్యం తోపాటు కందిపప్పు, లేదా శనగలు ఇచ్చేవారు. అయితే ఈ సారి  బియ్యం మాత్రమే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వాస్తవానికి జులై నెల నుంచే నగదుకే సరుకులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే నవంబరు వరకు రేషన్ ఉచితంగా ఇస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. అందువల్ల రేషన్ సరుకులు ఉచితంగా ఇవ్వాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది. దాంతో పప్పు ఇవ్వకుండా కేవలం బియ్యం మాత్రమే ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో జులై మొదటి విడత పంపిణీ లో బియ్యం, కందిపప్పు ఉచితంగా అందజేశారు. జులై 18వ తేదీ నుంచి రెండో విడత రేషన్ పంపిణీ లో కందిపప్పు లేకుండా బియ్యం మాత్రమే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇక నుండి నవంబర్ వరకు నెలలో ఒకసారి మాత్రమే కందిపప్పు లేదా శనగలు ఇవ్వనున్నారు, చక్కెర మాత్రం ఎప్పటిలాగే నగదుకే ఇవ్వనున్నారు.

Related posts

ఆశల ఐక్య పోరాటాల వల్లనే సమస్యల పరిష్కారం

Satyam NEWS

దళిత బందు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అమలు చేయాలి

Satyam NEWS

కృష్ణాయపాలెంలో రైతుల నిరసన దీక్ష

Satyam NEWS

Leave a Comment