28.7 C
Hyderabad
April 25, 2024 06: 29 AM
Slider ప్రపంచం

మసీదుల్లో వారికి మాత్రమే అనుమతి.. సౌదీ ఆదేశాలు జారీ

సౌదీ ఆరేబియాలో వ్యాక్సినేషన్‌ చేసుకున్న వారికి మాత్రమే మసీదుల్లో అనుమతి ఉంటుందని చెబుతోంది. గ్రాండ్, ప్రొఫెట్ మసీదులో ఉమ్రా, ప్రార్థనలపై సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా కీలక ప్రకటన చేసింది. కేవలం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఈ రెండు మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.

ఈ మేరకు ఆ దేశ మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నిబంధనలు అక్టోబర్ 10 ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న సందర్శకులు గ్రాండ్, ప్రొఫెట్ మసీదులో ఉమ్రా, ప్రార్థనలు నిర్వహించుకోవచ్చని పేర్కొంది.

Related posts

జోగులాంబ వార్షిక బ్రహ్మోత్సవాలకు ప్రముఖులకు ఆహ్వానం

Bhavani

త్వరలో హైదరాబాద్ –ముంబై మధ్య బుల్లెట్‌ రైలు..మూడున్నర గంటల్లోనే..

Sub Editor

తిరుప‌తి బ్ర‌హ్మోత్స‌వాల తరహాలో పైడితల్లి అమ్మ‌వారి జాత‌ర‌

Satyam NEWS

Leave a Comment