36.2 C
Hyderabad
April 25, 2024 21: 05 PM
Slider ఆధ్యాత్మికం

గరుడ వాహనంపై సీతాపతి……

#garudavahanam

కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మూత్సవాల్లో భాగంగా ఐదో రోజు గురువారం రాత్రి స్వామివారు గరుడ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన వాహన సేవ 8.30 గంటల వరకు జరగనుంది.

భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.నవాహ్నిక బ్రహ్మూత్సవాల్లో గరుడసేవ ముఖ్యమైనది. గరుత్మంతుడే శ్రీమహావిష్ణువుకు నిత్యవాహనం. దాసుడుగా, సఖుడుగా, విసనకఱ్ఱగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా ధ్వజంగా అనేక విధాల సేవలందిస్తున్న నిత్యసూరులలో అగ్రగణ్యుడైన వైనతేయుడు కోదండరామస్వామిని వహించి కదిలే తీరు సందర్శనీయమైనది. 108 దివ్య దేశాలలోనూ గరుడ సేవ విశిష్టమైనది.

వాహ‌న‌సేవ‌లో డెప్యూటీ ఈఓ శ్రీ రమణప్రసాద్, ఏఈఓ సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ పి.వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.
.

Related posts

మంటలు రేపుతున్న బూతు మాటలు

Satyam NEWS

గాన గంధ్వరుడు ఎస్ పి బి కి కరోనా పాజిటీవ్

Satyam NEWS

త్రికోటేశ్వరుడి సేవలో హైకోర్టు న్యాయమూర్తి రవినాథ్

Satyam NEWS

Leave a Comment