36.2 C
Hyderabad
April 25, 2024 22: 32 PM
Slider సినిమా

“ఆహా”లో “ఊరెళ్ళిపోతా మామ” అనూహ్య విజయం

#oorellipotamama

పాత సినిమాల నుంచి.. నిజ జీవితం నుంచి నిరంతరం నేర్చుకుంటూ తనను తాను నటుడిగా… వ్యక్తిగా తీర్చిదిద్దుకుంటున్నానని అంటున్నాడు వర్తమాన యువ కథానాయకుడు శ్రీ మానస్. పక్కా హైదరాబాద్ పిల్లగాడైన శ్రీ మానస్ నటించిన “ఊరెళ్ళిపోతా మామ” చిత్రం అసలు సిసలు తెలుగు ఓటిటి “ఆహా”లో అసాధారణ స్పందన అందుకుంటోంది!!

మెరీనా సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో వరుణ్ శుభలేఖ సుధాకర్, మహేష్ విట్టా, టిఎన్ఆర్, మ్యాడి, సెహరా పద్మాజయంతి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. అంజన్ రెడ్డి దర్శకత్వంలో తాడిపత్రి వెంకట కొండారెడ్డి- జి దామోదర్ రెడ్డి – ఎస్ మారుతి ప్రసాద్ -కె హిమాన్విత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన “ఊరెళ్ళి పోతా మామా” చిత్రం “ఆహా”లో అనూహ్య విజయం సాధిస్తుండడం అనిర్వచనీయమైన ఆనందాన్నిస్తోంది అంటున్నాడు శ్రీ మానస్. ఈ విజయం ఉత్సాహంతో ఉరకలు వేసేలా చేస్తోందనీ అంటున్నాడు!

శర్వానంద్, శ్రీ విష్ణు వంటి హీరోలను పరిచయం చేసిన బహుముఖ ప్రతిభాసాలి దొరైరాజ్ దర్శకత్వంలో రూపొంది.. కరోనా కష్టకాలంలోనూ ఘన విజయం సాధించిన “పటారుపాలెం ప్రేమకథ” తో హీరోగా పరిచయమైన శ్రీ మానస్… తనను హీరోగా పరిచయం చేసిన దొరైరాజ్గారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెబుతున్నాడు!!

“పటారుపాలెం ప్రేమకథ”తో హీరోగా తన ప్రతిభను ప్రకటించుకుని… “ఊరెళ్ళిపోతా మామా” సాధిస్తున్న అనూహ్య విజయాన్ని అమితంగా ఆస్వాదిస్తున్న శ్రీ మానస్… త్వరలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న “పొట్లగిత్త” చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. వెంకట్ ఈ చిత్రానికి దర్శకుడు!!

అమ్మ-నాన్న లేని లోటును భర్తీ చేస్తూ తనను నిరంతరం వెన్ను తట్టి ప్రోత్సహించే “అన్నయ్య – వదినమ్మ – అక్కలు” గర్వపడేలా తన కెరీర్ ను తీర్చిదిద్దుకుంటానని చెబుతూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యే ఈ అచ్చ “తెలంగాణ పోట్లగిత్త” హీరోగా మాత్రమే కాదు.. ప్రాధాన్యం ఉన్న పాత్రలు వస్తే “క్యారెక్టర్స్ రోల్స్” చేయడానికి సైతం తాను సిద్ధమేనంటున్నాడు. అన్నట్లు మహేష్ బాబులా మంచి అందగాడైన శ్రీమానస్… మహేష్ బాబుకు వీరాభిమాని కావడం గమనార్హం!!

Related posts

ఘనంగా హారర్ థ్రిల్లర్ ఎస్ 5 నో ఎగ్జిట్ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం

Bhavani

పామేడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులపై దాడులు అప్రజాస్వామికం

Bhavani

వరదల కారణంగా ఆర్ధికంగా పతనమైన పాకిస్తాన్

Bhavani

Leave a Comment