27.7 C
Hyderabad
April 26, 2024 03: 38 AM
Slider సినిమా

విజయదశమి శుభాకాంక్షలతో ఊర్వశి ఏటిటి

#UrvasiATT

విజయదశమి సందర్భంగా “ఊర్వశి” పేరుతో ఓ అత్యంత అధునాతన “ఏటిటి” ప్రకటించారు ఓ ప్రముఖ ఎన్నారై. అతి త్వరలో దీనిని “ఆహా, జీ5, అమెజాన్, నెట్ ఫ్లిక్ తరహాలో “ఓటిటి”గా మార్పు చేసేందుకు సైతం భారీ ఎత్తున రంగం సిద్ధం చేస్తున్నారు.

తీసిన సినిమాను స్ట్రీమింగ్ చేయడంతోనే సరిపెట్టుకోకుండా సినిమా తీసేందుకు అవసరమైన సాంకేతిక సహకారం సమకూర్చాలన్న స్థిర సంకల్పంతో “ఊర్వశి” ముందుకొస్తోంది.

“కెమెరాలు, లైట్స్, అవుట్ డోర్ యూనిట్” సహా.. “ఎడిటింగ్, డబ్బింగ్, 5.1, గ్రాఫిక్స్, డి.ఐ” వంటి మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ సపోర్ట్ అందివ్వనుండడం “ఊర్వశి” ప్రత్యేకత కానుంది.

అంతేకాదు… సినిమా రూపకల్పనకు “సాంకేతిక భాగస్వామి”గా వెన్నుదన్నుగా నిలవడంతోపాటు తీసిన సినిమాలను సమర్ధవంతంగా మార్కెటింగ్ (థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ రైట్స్) చేసుకోవడంలోనూ నిర్మాతలకు మార్గదర్శకత్వం వహించాలని కూడా “ఊర్వశి” ఉవ్విళ్లూరుతోంది.

సినిమాలు, వెబ్ సిరీస్, వెబ్ మూవీస్, షార్ట్ ఫిల్మ్స్ తీయాలని తపించే ప్రతిభావంతులకు “ఊర్వశి” సాదర స్వాగతం పలుకుతోంది. ఆసక్తి కలవారు urvasiatt.com@gmail.com లో సంప్రదించవచ్చు.

Related posts

ముగింపున‌కు చేరుకున్న దిశ జాగృతి యాత్ర‌…!

Satyam NEWS

JEE Mains, NEET పరీక్షలను వాయిదా వేయాలి

Satyam NEWS

స్టోరీ బిగిన్స్: కోయంబేడు వెళ్ళిన వ్యక్తికి కరోనా

Satyam NEWS

Leave a Comment