39.2 C
Hyderabad
April 23, 2024 15: 58 PM
Slider ముఖ్యంశాలు

ఛాలెంజ్: అక్రమ కట్టడాలు కూలగొట్టి నిజాయితీ నిరూపించుకో

revanth

హైదరాబాద్ లోని కూకట్ పల్లి రెవిన్యూ పరిధిలోని 376 సర్వే నంబరులో జరుగుతున్న అక్రమ కట్టడాల నిర్మాణాలను నిలిపివేసి మంత్రి కేటీఆర్ నీతి నిజాయితీ నిరూపించుకోవాలని మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో జరిగే ఓ పెళ్లి వేడుకకు వెళ్తుండగా నిజాంసాగర్ మండలం నర్సింగ్ పల్లి చౌరస్తా వద్ద కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

అక్కడే ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే: అక్రమ కట్టడాలపై మంత్రి కేటీఆర్ నియమించిన టాస్క్ ఫోర్స్ అధికారులకు కట్టడాలను కూల్చి వేయాలని  రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా మావాళ్ళు ఎన్ని చేసినా తప్పులేదు, నిజాయితీగా కట్టుకునే ఇళ్లకు అనుమతి ఇవ్వొద్దని చెప్పినట్టు ఉంది కేటీఆర్ తీరు. కేటీఆర్ గురించి పది మాటలు మాట్లాడను. సూటిగా అడుగుతున్నా.. నేను ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు ఫేస్ బుక్, ట్విట్టర్ లో అప్ లోడ్ చేయండి.

కూకట్ పల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 376 లో 300 కోట్ల విలువైన భూమిలో అనుమతి లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయి. మీ అధికారులకు ఫిర్యాదు చేసినం, ఫోన్లలో మాట్లాడినం. కానీ వాటిపై ఈగ కూడా వాలడం లేదు. మీడియా ద్వారా నేను కేటీఆర్ కు ఫిర్యాదు చేస్తున్నా.. ఇదే ఫిర్యాదుగా స్వీకరించి నీ నీతి,నిజాయితీ నిరూపించుకో. అక్రమాలు చేపడితే ఎవరినైనా తొలగిస్తామని చెప్తున్నావ్.

అదే అధికారులను అదేశించి కూకట్ పల్లి 376 సర్వే నంబరులో జరుగుతున్న అక్రమ కట్టడాలు కులగొట్టించాలని సవాల్ విసురుతున్న. 48 గంటల్లో చర్యలు తీసుకోకపోతే ఇందులో జరుగుతున్న కోట్లాది రూపాయల లావాదేవీల్లో నీకు కూడా వాటా ఉందని ప్రజలు, మేము భావించాల్సి ఉంటుంది.  నీకు చేతనైతే నీతి నిజాయితీ నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం ఇస్తున్నా.. కేటీఆర్  మీద నాకు నమ్మకం లేదు.

దోపిడిలో ఆయనే దిట్ట.. మొదటివాడు. ప్రజలను మభ్యపెట్టడానికి అధికారుల ఉద్యోగాలు ఉడుతాయని, మొత్తం మీరే ఊడ్చుకోవడానికి తెలివి తేటలు ప్రదర్శిస్తున్నారు. ఇవన్నీ ప్రజలకు చెప్పే బాధ్యత నాపై ఉంది.  అక్రమ నిర్మాణాలను ఆపి నీతి నిజాయితీ గురించి మాట్లాడితే బాగుంటుంది.

Related posts

పెరిగిన ద్వారకా తిరుమల ఆలయ ఆదాయం

Satyam NEWS

మళ్లీ మళ్లీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు

Satyam NEWS

రైస్ మిల్ డ్రైవర్ల, యాజమాన్యం మధ్య చర్చలు విఫలం

Satyam NEWS

Leave a Comment