Slider నెల్లూరు

రాజకీయాల్లో నైతిక విలువలు లేని నల్లపురెడ్డి

#TDP Nellore

ఈ దేశానికి ప్రధాని అయ్యే అర్హతలు చంద్రబాబు ఒక్కరికే ఉన్నాయని చెప్పి లేఖ రాసిన కోవూరు శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇప్పుడు ఆయనను తీవ్రంగా విమర్శిస్తున్నారని నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు.

కోవూరు ప్రజల సమస్యలు పరిష్కారం చేయడానికి ఎలాంటి శ్రద్ధ చూపని ప్రసన్నకుమార్ రెడ్డికి చంద్రబాబునాయుడిని విమర్శించే హక్కు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. 2008 సంవత్సరం లో చంద్రబాబు నాయుడుకు ప్రసన్న కుమార్ రెడ్డి రాసిన లేఖను మీడియాకు చేజర్ల విడుదల చేశారు.

అందులో ప్రసన్న కుమార్ రెడ్డి చంద్రబాబునాయుడిని ఆకాశానికి ఎత్తారు. ఈ దేశాన్ని చంద్రబాబునాయుడు ఒక్కరే కాపాడగలరని ప్రసన్నకుమార్ రెడ్డి చెప్పారు. అలా లేఖ రాసిన ప్రసన్న కుమార్ రెడ్డికి ఏం రాజకీయ విలువలున్నాయని చేజర్ల ప్రశ్నించారు.

ఈ సందర్భంగా ఆయన ప్రసన్నకుమార్ రెడ్డికి కొన్ని ప్రశ్నలు సంధించారు. అవి: 1.దేశాన్ని కాపాడే శక్తి మీకు ఒక్కరికే ఉంది, మీరు ప్రధాన అయితేనే దేశం బాగుపడుతుందని 2008 లో చంద్రబాబు నాయుడు కు లేఖ రాయలేదా? 2. కోటలో నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి విగ్రహాన్నిలక్ష్మీపార్వతి తో అవిష్కరింప చేసి ఆ సభలో లక్ష్మీపార్వతి ని ఆంధ్ర జయలలిత అని పొగిడావా లేదా?

తెలుగుదేశం పార్టీలో సంక్షోభానికి నీవు కారణం కదా?3. మీ పెదనాన్న చంద్రశేఖర్ రెడ్డి సంతాప సభలో నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారని వేదిక దిగి వెళ్లిపోయావా లేదా? ఆ సభలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై విమర్శలు చేసినది వాస్తవం కాదా?

మళ్లీ కొద్ది రోజులకే నేదురుమల్లి జనార్ధన రెడ్డి ని కలిసి ఆయనపై పొగడ్తల వర్షం కురిపించలేదా? 4. 2008 లో ప్రజారాజ్యం పార్టీలో చేరుతావని నీ పై పత్రికలలో వార్తలు వస్తే కొడవలూరు లో జరిగిన పార్టీ సమావేశంలో తనకు ఒకేఒక్క బిడ్డ ఉన్నాడని నా బిడ్డపై ప్రమాణ చేసి చెపుతున్నాను నేను జీవితాంతం చంద్రబాబు నాయకత్వం లో పనిచేస్తానని ప్రమాణం చేసి మాట తప్పు లేదా?

5. వై యెస్ రాజశేఖర్ రెడ్డిని,రాయలసీమ రౌడీ ఫ్యాక్షనిస్టు అని తిట్టింది నీవు కాదా? తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్ష కోట్లు దోచుకున్నాడని జగన్మోహన్ రెడ్డి ని నీవు తిట్టలేదా? 6. నిన్నటికి నిన్న జిల్లా కలెక్టర్ పై త్రీవ విమర్శలు చేసి రెండు రోజులు గడవక ముందే ఆయనను కొవూరుకు పిలిచి పొగడలేదా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చేజర్ల సవాల్ చేశారు.

Related posts

భారతీయ కుటుంబ వ్యవస్థలో శ్రీరాముడు అంతర్భాగం

mamatha

జగన్ పెట్టుకున్నది సోషల్ మీడియా సైతాన్ సైన్యం

Satyam NEWS

ప్రధాని భద్రతా వైఫల్యంపై సుప్రీం నిర్ణయం

Sub Editor

Leave a Comment