38.2 C
Hyderabad
April 25, 2024 13: 39 PM
Slider నల్గొండ

ఉపాధ్యాయులకు తీరని అన్యాయం చేస్తున్న ప్రభుత్వం

#azeejpasha

తెలంగాణ రాష్ట్రం వస్తే అదనంగా లాభం చేకూర కున్నా కనీసం హక్కుల పరిరక్షణ ఇంకా బగుపడతాయి అనుకొని సకల జనుల సమ్మెలో పెద్దన్న పాత్ర పోషించిన ఉపాధ్యాయులకు రాష్ట్రంలో తీరని అన్యాయం జరుగుతుందని టి.పి.సి.సి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఎండీ.అజీజ్ పాషా అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక దృష్టితో  సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ తరపున కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కెసిఆర్ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖను మంగళవారం నాడు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మీడియాకు అందచేశారు. బహిరంగ లేఖలోని అంశాలు ఇవి:

1.ఉమ్మడి సర్వీస్ రూల్స్ ను కనీసం అడ్ హక్ గా నైనా (గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టు) అమలు చేసి వెంటనే పదోన్నతులు కల్పించాలి.

2.నియామకం నుండి ఇప్పటివరకూ బదిలీకి నోచుకోని మోడల్ స్కూల్ టి.జి.టి,పి.జి.టి,ప్రిన్సిపాల్స్ కు వెంటనే బదిలీలు నిర్వహించాలి.

3.317 జీ.వో అమలు వల్ల నష్టపోయి స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి.

4.స్పౌజ్ బదిలీలకు దరఖాస్తు చేసుకొన్న వారిని పరిశీలించి కూడా

9 నెలలు ముగుస్తున్నా 13 జిల్లాలను  బ్లాక్ లో పెట్టిన వారికి బదిలీలు ఇవ్వటం లేదని,కావున వెంటనే 13 జిల్లాల బ్లాక్ ను ఎత్తి వేయాలి.

5.కె.జి.బి.వి పాఠశాలల్లో,కళాశాలల్లో పనిచేస్తున్న సి.ఆర్.టి,పి.జి.సి.ఆర్.టి.లకు వెంటనే బదిలీలు నిర్వహించాలి.

6.దశాబ్దాల కాలంగా వేచిచూస్తున్న భాషా పండితులు పి.ఈ టీ ల అప్ గ్రేడేషన్ చేపట్టాలి,(ప్రపంచ తెలుగు మహాసభల్లో స్వయంగా తమరు 2017 సంవత్సరంలో పాల్గొని వాగ్ధానం చేశారని,అట్టి వాగ్ధానం నిలబెట్టుకోవాలి.

7.కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో రద్దు చేసిన సి.పి.ఎస్ విధానం ను తమరు కూడా రద్దు చేయాలని,ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించి వారికి తగిన న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా విజ్ఞప్తి చేశారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

మైనారిటీలను అణగతొక్కుతున్న ముఖ్యమంత్రి జగన్

Satyam NEWS

జీ హుజూర్… నీబాంచన్ కాల్మొక్కుతా… ఇంకా… ఇంకా…

Satyam NEWS

ఏపికి పట్టిన కుల వైరస్ కరోనా కన్నా చెడ్డది

Satyam NEWS

Leave a Comment