40.2 C
Hyderabad
April 19, 2024 17: 44 PM
Slider మెదక్

సిద్దిపేటలో సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ ప్రారంభం

#Harish Rao

జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మెడికల్ కళాశాల ఆవరణలో ప్రభుత్వ కేంద్రీయ ఔషధ గిడ్డంగి, 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణాలకు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ విమలా థామస్, డీఎంహెచ్ఓ డాక్టర్ కాశీనాథ్, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

కాగా మెడికల్ కళాశాల నిర్మాణ పనులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని వైద్యశాఖ ఇంజనీరింగ్ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ మేరకు సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ ప్రారంభంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 12చోట్ల సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ సీఎంఎస్ ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కో దాని కోసం రూ.3.86 కోట్ల చొప్పున రూ.43.20 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. అవసరమైన సిబ్బందిని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నాం. వీటి ఏర్పాటుతో రోగులకు వెంటనే మందులు అందుతాయి.

వీటి పరిధిలో ఆసుపత్రులకు సకాలంలో మందులు పంపిణీ ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు సిద్ధిపేటకు మందులు హైదరాబాదు డ్రగ్స్ స్టోర్ నుంచి పంపిణీ జరిగేవి. ఇక నుంచి సిద్ధిపేటలోనే డ్రగ్స్ స్టోర్ అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందించే మందుల సంఖ్యను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గణనీయంగా పెంచింది. ఇప్పటి వరకు 720గా ఉన్న జాబితా 843 కు పెంచింది. ఇందులో ఈఎంఎల్ లో 311, ఏంఏంఎల్ జాబితాలో 532 మందులు ఉన్నాయి.

దీనితో కొత్తగా 123 రకాల మందులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి రానున్నాయి. ప్రతీ ఆసుపత్రిలో 3 నెలలకు సరిపడేలా బఫర్ స్టాక్ ఉండేలా చూడాలని వైద్యాధికారులను ఆదేశించాం. డిశ్చార్జ్ అయ్యే పేషేంట్ కు అవసరమైన అన్నీ మందులు ఇస్తూ ఇంటికి పంపిస్తున్నాం అని మంత్రి అన్నారు. రాష్ట్రంలో తొలిసారి రూ.20 కోట్లతో బయో మెడికల్ ఎక్విప్ మెంట్ మెయింటనెన్స్ పేరిట వైద్య పరికరాల నిర్వహణకు పాలసీ రూపొందించాం. వైద్య పరికరాలు ఎప్పటికప్పుడు నిర్వహించేందుకు ప్రత్యేకంగా ప్రోగ్రాం మానిటరింగ్ యూనిట్-పీఏంయూ ను టీఎస్ ఎంఎస్ఐ డీసీలో ఏర్పాటు చేశాం. వైద్య పరికరాల వివరాలు అన్నీ కూడా వెబ్ పోర్టల్ లో నమోదై ఉంటాయి.

ప్రస్తుతం ఏ ఆసుపత్రిలో ఉన్నాయో..? తయారీ తేదీ.? వారంటీ తేదీ.? గతంలో జరిగిన మరమ్మతుల వివరాలు, ప్రస్తుత మెయింటెనెన్స్ కాంటాక్ట్ వివరాలు ఇలా అన్నీ అందులో ఉంటాయని మంత్రి తెలిపారు. ఆసుపత్రులలో కొత్త డైట్, శానిటేషన్ పాలసీ సైతం అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆసుపత్రులలో పారిశుద్ధ్య ప్రమాణాలు పెంచడం కోసం, పారిశుద్ధ్య కార్మికులకు, ఇతర సిబ్బందికి వేతనాలు పెంచాలని నిర్ణయించిన మేరకు ప్రభుత్వం బెడ్ ఒక్కింటికి చేసే పారిశుద్ధ్య ఖర్చును 5వేల నుంచి 7500 పెంచిందని, ఇందు కోసం రూ.338 కోట్లు ప్రతీ యేటా వెచ్చించినట్లు మంత్రి వెల్లడించారు.

సిద్ధిపేటలో ఆయూష్ ఆసుపత్రి:

సిద్ధిపేటలో రూ.15కోట్లతో 50 పడకల ఆయూష్ ఆసుపత్రి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. ఆయూష్ కు మంచి భవిష్యత్తు ఉంది. మారుతున్న కాల పరిస్థితుల నేపథ్యంలో సంప్రదాయ వైద్యానికి రోజు రోజుకీ ప్రాధాన్యత పెరుగుతున్నదని ఆరోగ్య మంత్రి హరీశ్ చెప్పారు. ప్రజలు సంప్రదాయ వైద్యంపై ఆసక్తి చూపుతున్నారని, ప్రాముఖ్యత గుర్తించిన ప్రభుత్వం ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టిందని చెప్పారు. ఆయూష్ ఆయుర్వేదం, యోగ, నాచురోపతి, యునాని, సిద్ధ, హోమియో దేని ప్రత్యేకత దానిదేనని చెప్పుకొచ్చారు.

Related posts

ఇతర రాష్ట్రాల కూలీలకు బియ్యం, ఆర్ధిక సాయం

Satyam NEWS

ప్రతి సమస్యకు పరిష్కారం చూపగలిగేది మార్క్సిజమే

Bhavani

22 నుంచి 4 రోజుల‌ పాటు మంత్రి బొత్స సొంత జిల్లా పర్యటన

Satyam NEWS

Leave a Comment