39.2 C
Hyderabad
March 29, 2024 14: 43 PM
Slider ప్రత్యేకం

ఆపరేషన్ క్యాట్ ఫిష్: ఈటలతో వెళ్లకుంటే పదవి గ్యారెంటీ

#etala

భూ కుంభకోణం ఆరోపణలతో మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ తో టీఆర్ఎస్ లీడర్లతో బాటు క్యాడర్ కూడా వెళ్లకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ పకడ్బంది ప్రణాళిక రచించారు.

ఒక వేళ ఈటెల బయటకు పోయి సొంత పార్టీ పెట్టుకున్నా తాము నిర్మించుకున్న బలమైన పునాదులు కదిలిపోకుండా ఉండేలా కేసీఆర్ చర్యలు మొదలు పెట్టారు.

ఈటెల రాజేందర్  వెంట క్యాడర్ వెళ్లకుండా రాష్ట్ర స్థాయి నాయకత్వం ఇప్పటికే ఆపరేషన్ క్యాట్ ఫిష్ చేపట్టింది.

దీనిలో భాగంగానే జిల్లా కు చెందిన మంత్రులు రంగం లోకి దిగారని తెలిసింది. అదే సమయంలో ఈటెల ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని పార్టీ ఆదేశించింది.

ఈటెల ను ఒంటరి చేసి మూకుమ్మడి దాడి చేయాలన్నది కెసిఆర్ వ్యూహంగా చెబుతున్నారు. వ్యూహంలో భాగంగా సెకండ్ క్యాడర్ కు నామినేటెడ్ పదవులను ఎర వేస్తుందని సమాచారం.

ఈ ఎత్తుగడతో ఈటెల నుండి కింది స్థాయి కార్యకర్తలను దూరం చేయాలన్నది టార్గెట్.

ఈటెల ఆస్తులపై ఒకవైపు దాడి చేస్తూనే మరోవైపు రాజకీయంగా దెబ్బ తీయాలన్నది కెసిఆర్ వ్యూహం రచించినట్లు సమాచారం.

ఇది ఇలా ఉండగా ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈటల టీఆర్ఎస్ నుంచి బయటకు రావాలా వద్దా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ సమావేశంలో తెరాస రాష్ట్ర కార్యదర్శి, ఈటెల ముఖ్య అనుచరుడు బండ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈటలను టీఆర్ఎస్ పార్టీలో కొనసాగనివ్వాలని కోరారు.

ఈటల టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని కొందరు కోరుతుండగా మరి కొందరు వద్దు అంటున్నారు.

ఈటల ముఖ్య అనుచరుడు అయిన బండ శ్రీనివాస్, ఈటల పార్టీలో కొనసాగాలని కోరడం వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు ఇతర అనుచరులు అనుమానిస్తున్నారు.

మామిడి రవీందర్ గౌడ్, సత్యం న్యూస్

Related posts

2 వేల మంది బస్‌ ఆఫీసర్ల నియామకం

Bhavani

జీహెచ్ఎంసీ పబ్లిక్ టాక్ (ప్రజావాణి)

Sub Editor

దళిత దండోరా సభలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

Satyam NEWS

Leave a Comment