35.2 C
Hyderabad
April 20, 2024 18: 02 PM
Slider మహబూబ్ నగర్

ఆపరేషన్ ముస్కాన్: వెట్టిచాకిరి నుండి చిన్నారులకు విముక్తి

#operationmuskan

నాగర్ కర్నూలు జిల్లాలో బాల బాలికలను కాపాడటానీకి, వారికి విద్యతోపాటు మంచి భవిషత్తు అందించడానికి ఆపరేషన్ ముస్కాన్ ను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ అధికారులకు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళా శిశు సక్షేమo, పోలీసు, వివిధ శాఖల అధకారులతో కలెక్టర్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీసు శాఖ ఆధ్వర్యంలో జూలై 1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ 8వ విడుత కార్యక్రమం కొనసాగుతుందనీ, బడిబయట ఉన్న బాలలు బాలకార్మికులను గుర్తించి, తగు సంరక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. పిల్లలతో పని చేయించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

బడి బయట పిల్లలను గుర్తించిన, బాల కార్మికులు ఉన్నట్లు తెలిసినా తక్షణమే పోలీసులకు, బాలల సంరక్షణ అధికారులకు లేదా చైల్డ్ లైన్-1098 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. బాలలకు మంచి భవిష్యత్తు అందించడమే ఆపరేషన్ ముస్కాన్ ముఖ్య ఉద్దేశం అని కలెక్టర్ పేర్కొన్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేక నిర్లక్ష్యానికి గురైన వారు నిస్సహాయ స్థితిలో ఉన్న పిల్లల కు అధికారులు ఆశ్రయం కల్పించాలనీ  సూచించారు.

వెట్టిచాకిరి నుండి చిన్నారులకు విముక్తి కల్పించి, విద్యానందించి మంచి భవిష్యత్తు కల్పించడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి ఆదేశించారు. అనంతరం ముస్కాన్ కార్యక్రమ కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రామేశ్వర్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని టి యు వెంకటలక్ష్మి, డీఈవో గోవిందరాజులు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి నిరంజన్ చైల్డ్ ప్రొటెక్షన్ చైర్మన్ లక్ష్మణరావు, వివేకానంద అసోసియేషన్ రామకృష్ణ,  తదితరులు పాల్గొన్నారు.

Related posts

న్యూ డైమన్షన్: బీజేపీ వైపు ఆదిలాబాద్ ‘రెడ్డి’ చూపు

Satyam NEWS

స్థానిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

Bhavani

సహాయ కార్యక్రమాల్లో ఎన్జీఓలను భాగస్వామ్యులను చేయాలి

Satyam NEWS

Leave a Comment