32.7 C
Hyderabad
March 29, 2024 11: 15 AM
Slider మహబూబ్ నగర్

సహజసిద్ధమైన పండ్లను తిని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

#MLA Kollapur

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లోని కెఎల్ఐ గెస్ట్ హౌస్ లో  క్షేత్ర ఆర్గానిక్ ఆధ్వర్యంలో  సహజసిద్ధమైన పండ్లను తినండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. 

స్వచ్ఛమైన పండ్లను తినండి, చైనా పౌడర్లు వాడొద్దు అని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.  కార్బడఐ లాంటి కెమికల్స్ వేసి కాయలను పండ్లుగా మారుస్తున్నారని, వాటిని తినడం వల్ల  అనారోగ్యం పాలవుతారని ఆయన అన్నారు. క్షేత్ర ఆర్గానిక్ వారు అవగాహన సదస్సు కల్పించడం చాలా మంచి పరిణామమని ఆయన అన్నారు. మన రైతులు 25 హెక్టార్ లలో మామిడి సాగు చేస్తున్నారు. 

త్వరలో మామిడి మార్కెట్ ప్రారంభిస్తామని ఆయన అన్నారు.  మామిడి రైతుల కష్టాలు తీరబోయే రోజు రాబోతున్నదని ఆయన అన్నారు.  ఈ కార్యక్రమంలో సిఐ బి. వెంకట్ రెడ్డి, శాస్త్రవేత్త ప్రమోద్ కుమార్ రెడ్డి, ఎండి రవి కుమార్, శ్రావణ్ కుమార్ రెడ్డి , కొల్లాపూర్ ఏరియా డైరెక్టర్ నవీన్ కుమార్ రెడ్డి  పాల్గొన్నారు.

Related posts

పోలీసు ఉద్యోగాలకు ములుగులో ఫ్రీ కోచింగ్

Satyam NEWS

ఇంటర్నెట్ బ్యాన్: దేశానికి ఇది నిజమైన గ్రహణం

Satyam NEWS

ఇంటర్ డిస్టిక్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోస్టర్ విడుదల

Bhavani

Leave a Comment