37.2 C
Hyderabad
April 19, 2024 13: 08 PM
Slider హైదరాబాద్

ఏ రిక్వెస్టు: అనాథలు, వృద్దులకు చేయూత నివ్వండి

governor 03

సమాజం లోని అనాథలు, వృద్దులకు ప్రభుత్వం తరపున చేయూత నందించాలని జ్యోతి రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ అనితా జ్యోతి రెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం రాజ్ భవన్ లో గవర్నర్ తమిలసై ను కలిసి వినతి పత్రం సమర్పించారు. తమ ఫౌండేషన్ తరపున అనాథలు, వృద్దులకు సహాయ సహకారాలు అందిస్తున్నామని అవి వారికి సరిపోవని ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందించాలని జ్యోతి రెడ్డి గవర్నర్ ను కోరారు.

ఈ సందర్బంగా ఆమె రాష్ట్రం లోని అనాథలు, వృద్దుల స్థితి గతుల గూర్చి గవర్నర్ కు వివరించారు. అనాథ బాల బాలికలకు సమాన హక్కులు కల్పించాలని, ఉద్యోగావకాశాల్లో ప్రత్యేక రేజర్వేషన్స్ కల్పించాలని, వివాహం చేసుకునే అనాధ పిల్లలకు కళ్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింపచేయాలని, అనాథలకు గుర్తింపు, ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు.

దీనిపై స్పందించిన గవర్నర్ ఈ విషయాన్ని అధికారుల దృష్టి కి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు జ్యోతి రెడ్డి తెలిపారు. గవర్నర్ ను కలిసిన వారి లో ఫౌండేషన్ మేనేజర్ రమేష్ ఆచార్య తదితరులు ఉన్నారు.

Related posts

నిర్మల్ లో ప్రారంభమైన సాయుధ పోరాట వారోత్సవం

Satyam NEWS

రెండు రోజులుగా తగ్గుతున్న కరోనా కేసులు

Satyam NEWS

ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలి

Satyam NEWS

Leave a Comment