28.2 C
Hyderabad
April 20, 2024 11: 42 AM
Slider ముఖ్యంశాలు

తక్షణమే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలి

#OU JAC

తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకుడు ఎనుగంటి రాజు నేత డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న నిరుద్యోగం మీద శ్రద్ధ వహించి నిరుద్యోగుల గోసను గుర్తించాలని ఈ మేరకు ఆయన నూతన టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులను కోరారు.

గత ఏడు సంవత్సరాలుగా రాష్ట్రంలో నిరుద్యోగులు అనేకరకాలైన ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డిగ్రీలు, పీజీలు, పీహెచ్ డీలు చేసి ఖాళీగా ఉంటున్నారని ఆయన అన్నారు. ఉద్యోగాలు లేక వయోభారంతో, వ్యయ భారంతో ఇంటికి వెళ్లలేక, పెళ్లిళ్లు గాక చాలా మంది విద్యార్థులు నిరుద్యోగులు యూనివర్సిటీలోనే ముఖం దాచుకుంటున్నారని రాజు నేత ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రం ఏర్పాటు అయిన తొలినాళ్లలో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ లక్షా 7  వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తామని తెలిపారు. కానీ ఇప్పటికీ ఆ హామీ నెరవేరలేదు అని రాజు నేత అన్నారు.

ఇప్పటివరకు కేవలం 30 వేల ఉద్యోగాలకు మాత్రమే భర్తీ చేశారని, టి ఎస్ పి ఎస్ సి ఎస్సీ అధికారిక లెక్కలు అంచనా ప్రకారం వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య 30 లక్షల దాకా ఉందని రాజు నేత వివరించారు.

ఇది కాకుండా మరో పది లక్షల మంది రాష్ట్రంలో నిరుద్యోగులుగా ఉన్నారని, అంటే మొత్తం మీద దాదాపుగా 40 లక్షల మంది నిరుద్యోగులు రాష్ట్రంలో ఉన్నారని ఆయన అన్నారు. ఈ లెక్కన చూసుకుంటే రాబోయే రోజుల్లో నిరుద్యోగం మరింత పెరిగి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే తీవ్రమైన పరిణామాలు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

కాబట్టి తక్షణమే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న యుపిఎస్సీ ఏ రకంగా అయితే ఉద్యోగ క్యాలెండర్ ఏర్పాటు చేస్తుందో అదే రకంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఉద్యోగాల క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

అందులో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఏ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి, వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారు, వాటికి సంబంధించిన తేదీలు అంటే  నోటిఫికేషన్ జారీ చేసే తేదీ, పరీక్ష నిర్వహించే తేదీ, ఫలితాలు ప్రకటించే తేదీ, ఇంటర్వ్యూలు నిర్వహించే తేదీ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీ, ఉద్యోగ నియామక పత్రం అందించే తేదీ తదితరాలన్నీ కూడా ఉద్యోగ క్యాలెండర్ లోనే వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

తెలంగాణ లో మూతపడ్డ పరిశ్రమల మాటేమిటి కేటీఆర్?

Satyam NEWS

రేపు హుజూర్ నగర్ కు రానున్న వైఎస్ షర్మిల

Satyam NEWS

ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల

Satyam NEWS

Leave a Comment