39.2 C
Hyderabad
April 25, 2024 15: 13 PM
Slider చిత్తూరు

ఆక్సిజన్ కట్: తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తం

#RuyaHospital

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా చేసే యంత్రాల పైప్ లైన్ లో సమస్యలు రావడంతో ఐ సి యూలో ఘోరం జరిగింది. అనధికార సమాచారం ప్రకారం దాదాపు 11 మంది రోగులు మరణించినట్లు సమాచారం అందుతున్నది.

మరో 18 మంది వరకూ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని సమాచారం. అధికారికంగా ఎవరూ ఏమీ చెప్పడం లేదు. వెంటిలేటర్ పైన ఉన్న పేషెంట్లు ఆక్సిజన్ సరఫరా లేక ఇబ్బంది పడుతున్నారు. టెక్నికల్ సిబ్బంది ఈ సమస్యను అధిగమించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం.

ఫిల్లింగ్ చేసేటప్పుడు కంప్రెజర్ తగ్గటంతో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఆక్సిజన్ సరఫరా మళ్లీ మొదలయ్యిందంటున్న అధికారులు. అయితే కుదుటపడని పరిస్థితి తో ఆస్పత్రి వద్ద  ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది.

ఆక్సిజన్ కోసం ఐసీయూ వార్డులో పేషెంట్ల బంధువులు ఆందోళన చేస్తున్నారు. ఐసీయూ వార్డులో వస్తువులను రోగుల బంధువులు పగులగొట్టారు. భయంతో నర్సులు, డాక్టర్లు, సిబ్బంది పరుగులు తీశారు. దాంతో కోవిడ్ ఆస్పత్రి నుంచి వైద్య సిబ్బంది వెళ్లిపోయింది.

Related posts

నీళ్ల నిరంజన్ రెడ్డి కాదు కమిషన్ల నిరంజన్ రెడ్డి

Satyam NEWS

అక్రమ సారాపై కర్నూలు జిల్లాలో ఉక్కుపాదం

Satyam NEWS

ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

Satyam NEWS

Leave a Comment