27.7 C
Hyderabad
April 25, 2024 07: 27 AM
Slider నల్గొండ

ప్ర‌ణాళిక,పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించాలి

Collage Maker-31-Jul-2022-11.17-PM

తల్లిదండ్రులకు,శిక్షణ అందించిన ఓజో ఫౌండేషన్ కు మంచి పేరు తేవాలి

ఓజో ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100 రోజుల ఉచిత కోచింగ్ పూర్తి చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలు రాయబోయే నిరుద్యోగ యువతను ఉద్దేశించి ఓజో ఫౌండేషన్ చైర్మన్ రఘు పిల్లుట్ల మాట్లాడుతూ ప్ర‌ణాళికతో,పట్టుదలతో చ‌దివితే ఉత్త‌మ ఫ‌లితాలు సాధించ‌వ‌చ్చని, అంతిమ ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకొని ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించి తల్లిదండ్రులతో పాటు ఉచిత శిక్షణ అందించిన ఓజో ఫౌండేషన్ కు మంచి పేరు తేవాలని పిల్లుట్ల రఘు కోరారు.

ఓజో ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 2,000 మంది గ్రూప్స్,ఎస్.ఐ,కానిస్టేబుల్స్ వంటి పోటీ పరీక్షల అభ్యర్థులకు అందించిన ఉచిత స్టడీ మెటీరియల్స్ ఎంతో ఉపయోగకరంగా ఉందని ఎస్.ఐ, కానిస్టేబుల్ శిక్షణ పూర్తయిన అభ్యర్థులు పరీక్షలు బాగా వ్రాసి ఉద్యోగాలు సాధించాలని రఘు పిల్లుట్ల ఆకాంక్షించారు.

సర్కారు కొలువులు సాధించాలనే లక్ష్యంతో నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ ప్రభుత్వ,ప్రైవేట్ స్టడీ సర్కిళ్లలో శిక్షణ తీసుకుంటూ గ్రంథాలయాల్లో వివిధ పుస్తకాలతో కుస్తీ పడుతున్నారని,యువతీ,యువకుల ఉద్యోగ సాధికారితకు ఓజో ఫౌండేషన్ అవసరమైన సహాయ,సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని రఘు హామీ ఇచ్చారు. సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

ప్రజాగర్జనకు 300 బస్సులు

Bhavani

ఇవేం ఎన్నికలు? :వాట్స్ యాప్ లో బ్యాలెట్ పేపర్లు

Satyam NEWS

అనంత రవాణా శాఖలో ACB సోదాలు

Satyam NEWS

Leave a Comment