32.2 C
Hyderabad
March 28, 2024 22: 08 PM
Slider మహబూబ్ నగర్

కేసీఆర్ ఎంత మొత్తుకున్నా పీవీ మావాడే

#MalluRavi

టిఆర్ఎస్ ఏడేళ్ల కాలంలో ఏ ఒక్క ప్రజా సంక్షేమ, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు చేయలేక ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడి పోతామనే భయంతో మాజీ ప్రధాని, కాంగ్రెస్ నాయకుడు పివి నరసింహారావు ఫోటో తో ఓట్లు అడుగుతున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు.

కాంగ్రెస్ నేత అయిన పివి బొమ్మ పెట్టుకుని, ఆయన ప్రతిష్టను మంట గలుపుతున్నారని మల్లు రవి అన్నారు. పివి జాతీయ అంతర్జాతీయ నేత, ఆయనను ఒక ప్రాంతీయ పార్టీ కి ప్రచారంగా అదీ ఒక మండలి ఎన్నికల ప్రచారంగా వాడుకోవడం దురదృష్టకరమని మల్లు రవి అన్నారు.

పివి ఫోటో పెట్టుకొని ఓట్లు అడుక్కునే స్థాయి కి కేసీఆర్ దిగజారి పోయారని ఆయన అన్నారు. పివి నర్సింహారావ్ జీవిత కాలం కాంగ్రెస్ పార్టీ లో ఉన్నారని, ఆయన కాంగ్రెస్ పార్టీ లో సామాన్య కార్యకర్త నుంచి ఏఐసీసీ అధ్యక్షులుగా అయ్యారని మల్లు రవి అన్నారు.

కాంగ్రెస్ పార్టీలోనే రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రి గా, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రి గా అయ్యారని మల్లు రవి గుర్తు చేశారు. ఇంత గొప్ప మేధావిని గుర్తించి అన్ని రకాలుగా అవకాశం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అలాంటిది ఎన్నికల కోసం ఆయనను కేసీఆర్ వాడుకుంటున్నారని మల్లు రవి అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చెన్నారెడ్డి కి పివి ఫోటో పెట్టి వ్యాపార ప్రకటనలు ఇచ్చే పరిస్థితి లేదు.

టిఆర్ఎస్ ఇచ్చిన ప్రకటనలో పివి ని గుర్తు చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం జరుగుతుంది. పివి అభిమానులు కాంగ్రెస్ వైపు మాత్రమే ఉంటారు. పివి నర్సింహరావ్ బొమ్మ పెట్టి ప్రచారం చేసి కాంగ్రెస్ కు ఉచిత ప్రచారం ఇస్తున్నారు.

కేసీఆర్ పివి నర్సింహారావు చనిపోయినపుడు కనీసం దహన సంస్కారాలకు కూడా పోలేదని మల్లు రవి గుర్తు చేశారు.

Related posts

గోదాములు సిద్ధం

Bhavani

వనపర్తి మున్సిపాలిటీలో అవినీతి: చైర్మన్ ను అనర్హుడిగా ప్రకటించాలి 

Satyam NEWS

4న తెలంగాణా కాంగ్రేస్ నేతలతో రాహుల్ గాంధీ భేటీ

Sub Editor 2

Leave a Comment