28.2 C
Hyderabad
March 27, 2023 09: 50 AM
Slider క్రీడలు జాతీయం ముఖ్యంశాలు

బంగారం సాధించిన పి వి సింధు

PV-Sindhu

భారత షట్లర్‌ పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో జపాన్‌ క్రీడాకారిణి ఒకుహరపై 21-7, 21-7 తేడాతో  ఘనవిజయం సాధించింది. దీనితో సింధు కొత్త చరిత్ర సృష్టించినట్లయింది. కొత్త చరిత్ర సృష్టించిన సింధుపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తున్నది. తొలి రౌండ్‌లో అదరగొట్టిన పీవీ సింధు రెండో రౌండ్‌లోనూ ప్రతిభ చూపింది. రెండో గేమ్‌లోనూ ఆది నుంచే పాయింట్లు సాధిస్తూ ఒకుహరపై పైచేయి సాధించింది. 2వ పాయింట్‌ నుంచి 9 పాయింట్ల వరకు వరుసగా చెలరేగింది. మధ్యలో ఒకుహర  రెండు పాయింట్లు సాధించినా సింధూ మళ్లీ జోరు కొనసాగించింది. విరామానికి 11-4తో అదరగొట్టింది. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించి 21-7తో విజేతగా నిలిచింది. తెలుగుతేజంపై ఏపి ముఖ్యమంత్రి ప్రశంసల వర్షం కురిపించారు. పీవీ సింధు

సిసలైన చాంపియన్ లా ఆడిందని ఆయన అభినందించారు. మ్యాచ్ ఆరంభం నుంచి చివరివరకు ఆధిపత్యం చూపిన సింధును వై ఎస్ జగన్ ప్రశంసించారు. “సింధూ శుభాభినందనలు. వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో పసిడి పతకం నెగ్గిన తొలి భారత షట్లర్ గా అవతరించింనందుకు కంగ్రాట్స్. ఫైనల్ మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిపత్యం చెలాయించడమే కాకుండా, సిసలైన చాంపియన్ లా మ్యాచ్ ను ముగించావు” అంటూ జగన్ ట్వీట్ చేశారు. 2019 బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ గెలిచినందుకు  పీవీ సింధు కి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయులంతా గర్వించేలా, నోజోమి ఒకుహారాపై గెలిచిన సింధు ఆటతీరు అద్భుతం. ఇలాంటి విజయాలు మరెన్నో సింధు సాధించాలని కోరుకుంటున్నాను అని లోకేష్ అన్నారు.

Related posts

పోరాట యావ చచ్చిన కమ్యూనిస్టులు

Satyam NEWS

ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి ఆడబడ్డకు జన్మనిచ్చిన ఐఏఎస్ అధికారిణి

Satyam NEWS

బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఇంట్లోనే జరుపుకుందాం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!