బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ తెలుగు తేజం పీవీ సింధూ ప్రముఖ సినీనటుడు నాగార్జున చేతుల మీదుగా బీఎండబ్ల్యూ కారు అందుకున్నారు. చాముండేశ్వరీనాథ్ బహూకరించిన ఈ కారు తాళాలను అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాగార్జున పీవీ సింధూకు అందజేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. పీవీ సింధూపై ప్రశంసలు కురిపించారు. ఆమెకు తానో అభిమానినన్నారు. ఫైనల్ మ్యాచ్ జరిగినప్పుడు తాను అమెరికాలో ఉన్నానని.. అక్కడే చూశానని చెప్పారు. చాముండేశ్వరి నాథ్ ఇప్పటివరకు 22 కార్లు పలువురికి గిఫ్ట్‌లుగా ఇవ్వగా.. అందులో నాలుగు కార్లు సింధూనే దక్కించుకోవడం విశేషమన్నారు. అనంతరం సింధూ మాట్లాడుతూ.. నాగార్జున ఎవర్ గ్రీన్ హీరో అన్నారు. బ్యాడ్మింటన్‌లో మరింతగా రాణించేందుకు కృషిచేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.
previous post
next post