28.7 C
Hyderabad
April 25, 2024 05: 28 AM
Slider ప్రత్యేకం

ఇంటెలిజెన్స్ చీఫ్ గా పి వి సునీల్ కుమార్?

#pvsunilkumarips

మూడు సంవత్సరాల పాటు సీబీసీఐడి చీఫ్ గా ఒక వెలుగు వెలిగిన ఐపిఎస్ అధికారి పి వి సునీల్ కుమార్ ను త్వరలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించబోతున్నట్లు తెలిసింది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటెలిజెన్స్ విభాగానికి పూర్తి స్థాయి అధికారిని నియమించలేదు. ఆ స్థానానికి తెలంగాణ నుంచి ఐపిఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను తీసుకుందామని జగన్ భావించినా అది కుదరలేదు.

అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో అత్యంత కీలకమైన ఆ విభాగం అడ్ హాక్ ఏర్పాట్లతోనే సాగుతున్నది. ఇంటెలిజెన్సు విభాగం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి తలలో నాలుక వంటిది. రాష్ట్రంలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి? శాంతిభద్రతలను కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే అంశాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై కూడా ప్రజాభిప్రాయాన్ని బేరీజు వేసుకోవడానికి గతంలో ముఖ్యమంత్రులు ఇంటెలిజెన్సు విభాగంపై ఆధారపడేవారు.

ఇంటెలిజెన్సు విభాగం నేరుగా ముఖ్యమంత్రి ఆధీనంలో పని చేస్తూ అవసరమైన సమాచారాన్ని సేకరించి ఇస్తుంది. అలాంటి కీలకమైన విభాగానికి పూర్తి స్థాయి అధికారి లేకపోవడం జగన్ ప్రభుత్వంలో లోపంగా ఉన్నది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఎక్కువ భాగం రాజకీయ పరమైన అంశాలే కావడంతో ఆ నిర్ణయాలపై ఎప్పటికప్పుడు ఐపాక్ టీమ్ (ప్రశాంత్ కిషోర్ బృందం) నివేదికలు ఇస్తున్నది.

సమాజంలో ఏ వర్గం ప్రజలు అసంతృప్తితో ఉన్నారు? వారిని తమ వైపు తిప్పుకోవడానికి  ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? అనే అంశాలపై ఐప్యాక్ బృందం ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తుండటంతో సీఎం జగన్ ఇంటెలిజెన్సు విభాగంపై ఆధారపడటం లేదా ఇంటెలిజెన్సు నివేదికలు తెప్పించుకోవడం లాంటి పనులు చేయడం లేదని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా పి వి సునీల్ కుమార్ ను ఆ విభాగానికి అధిపతిగా నియమించి కీలక సమాచారం తెప్పించుకోవాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నట్లు తెలిసింది. సునీల్ కుమార్ కూడా ముఖ్యమంత్రికి అత్యంత ఆప్తుడు అయినందున వాస్తవ పరిస్థితిని ఎప్పటికప్పుడు బేరీజు వేసి అందిస్తారని కూడా అనుకుంటున్నారు. ఈ స్థానాన్ని పి వి సునీల్ కుమార్ కు అప్పగించడం ద్వారా పార్టీ యంత్రాంగాన్ని మరింత పటిష్ట పరచుకోవచ్చునని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలిసింది.

Related posts

ఏపీయూడబ్ల్యూజే జిల్లా సభలకు మీరు రావాలి…!

Satyam NEWS

రాజ‌రాజ చోర‌తో మ‌రింత గుర్తింపు వ‌స్తుంది: న‌టి సునైన

Satyam NEWS

7న వాసా వెంక‌ట వ‌ర ప్ర‌సాద్ కు నివాళి కార్య‌క్ర‌మం

Satyam NEWS

Leave a Comment