27.7 C
Hyderabad
April 25, 2024 09: 46 AM
Slider నిజామాబాద్

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే

bichkunda 181

బిచ్కుంద మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ సిండే శనివారం బండాయప్ప పాఠశాల ప్రాంగణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మద్దతు ధర ఏ గ్రేడ్ 1835.బీ గ్రేడ్ 1815రూపాయలు కేటాయించిందని తెలిపారు.

రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే ధాన్యాన్ని అమ్ముకోవాలన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని ఒకరి తరువాత ఒకరు రైతులు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని అమ్ముకో అమ్ముకోవడానికి వచ్చి సిబ్బందికి సహకరించాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు సహకార సంఘం అధ్యక్షులు బాలాజీ, తహశీల్దార్ వెంకటరావు, వ్యవసాయ అధికారి పోచయ్య, సహకార సంఘం సిఇఓ శ్రావణ్కుమార్ మాజీ జడ్పీటీసీ సాయిరాం మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు సహకార సంఘం ఉపాధ్యక్షులు యాదవరావు పాల్గొన్నారు.

ఇంకా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బసవరాజ్ పాటిల్ తెరాస అధ్యక్షులు వెంకట్రావ్ దేశాయి, ఎంపీటీసీ చంద్రకళ రాజు, సీనియర్ నాయకులు షేక్ పాషా సెట్, గ్రామ రైతులు హమాలీ కార్మికులు పాల్గొన్నారు.

Related posts

అమ్మ భాష కమ్మదనం

Satyam NEWS

ఎమ్మెల్యే సైదిరెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నేతలు

Bhavani

మెడికో మర్డర్:వైద్య విద్యార్థిని దారుణంగా కొట్టి చంపారు

Satyam NEWS

Leave a Comment