27.7 C
Hyderabad
April 25, 2024 09: 55 AM
Slider నల్గొండ

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన జిల్లా సహకార అధికారి

#paddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రాధమిక వ్యవసాయ సహకార  సంఘ ద్వారా ఏర్పాటు చేయబడిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా సహకార అధికారి శ్రీధర్ గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన నియమ  నిబంధనల ప్రకారం రైతులు తమ ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టి శుభ్రపరచిన ధాన్యాన్ని మాత్రమే సెంటర్ ల వద్దకు క్రమ పద్దతిలో తీసుకువచ్చి ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర పొందవలసిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సబ్ డివిజినల్ సహకార అధికారి అంజయ్య, రైతులు యరగాని శ్రీనివాస్ గౌడ్,కంచర్ల మధుసూదన్ రెడ్డి, కందుల పద్మ, దేవరం మల్లీశ్వరి, దుగ్గి బ్రహ్మం,లచ్చిరామ్ నాయక్, మీసాల శ్యామ్ సుందర్, గోసుల శ్రీను, కటారు శ్రీను, పశ్య వెంకట దేవరం కిరణ్ రెడ్డి, రేపాకుల కోటయ్య, దుగ్గి సైదులు, పశ్య సుధాకర్ రెడ్డి, చిట్యాల నర్సిరెడ్డి, దేవరం పుల్లారెడ్డి, యరెద్దు శంకర్ రెడ్డి, గుర్రం రాము కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

నిత్యావసరాలు ధరలు ఇలా పెరిగితే బతికేది ఎలా?

Satyam NEWS

ప్రజల్ని ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోను

Satyam NEWS

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో పోలీసు కస్టడీలో జేసీ

Satyam NEWS

Leave a Comment