37.2 C
Hyderabad
April 19, 2024 13: 01 PM
Slider మహబూబ్ నగర్

వనపర్తి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

#WanaparthyCollector

వనపర్తి జిల్లా లో యాసంగి పంటగా రైతులు సాగు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వచ్చే వారం చివరలో కోవిడ్ నిబంధనలకు లోబడి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులకు ఆదేశించారు.

బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యాసంగి లో 3 లక్షల 40 వేల  మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించడం లక్ష్యం పెట్టుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఐకెపి 103 కేంద్రాల్లో, పిఎసిఎస్ 114, మార్కెట్ కమిటీ 2 కేంద్రాలు,మెప్మా 2 కేంద్రాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

ఇందుకు సరిపడా గన్ని బ్యాగులు సమకూర్చాలని అధికారులకు ఆదేశించారు.వరి ధాన్యం గ్రేడ్ ఏ  క్వింటాల్ కు రూ. 188 8, సాధారణ వరి ధాన్యం రూ. 1868 ప్రకారం కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఫ్యాక్ ప్రెసి క్యూషన్ ద్వారా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. కోవిడ్ నిబంధనలకు లోబడి రైతులు మాస్కులు ధరించాలని, శానిటైజర్ లు వాడాలని కోవిడ్ కేంద్రాల దగ్గర శానిటైజర్ అందుబాటులో ఉంచాలని, కేంద్రాల వద్ద శానిటేషన్ చేయించాలని అన్నారు. 

కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వరి ధాన్యం చేరవేసే లా సంబంధిత  వరి ధాన్యం రవాణా దారులు చూడాలన్నారు. వరి ధాన్యం కేంద్రాలను డి ఆర్ డి ఓ, డి సి ఓ అధికారులు పర్యవేక్షించాలని అన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డి ఎం సి ఎస్ అనిల్ కుమార్, సివిల్ సప్లై అధికారిణి రేవతి డి ఆర్ డి ఓ నరసింహులు, డి సి ఎస్ ఓ కోదండరామ్,  మార్కెటింగ్ అధికారి, వ్యవసాయాధికారులు, రైస్మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

వరుణ్ తేజ్ వాల్మీకి టీజర్ కి సూపర్ రెస్పాన్స్

Satyam NEWS

టాప్ ఫైవ్ లవ్ స్టోరీస్ లో 18 పేజెస్ ఉంటుంది: నిఖిల్

Bhavani

ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్

Bhavani

Leave a Comment