36.2 C
Hyderabad
April 16, 2024 20: 10 PM
Slider కరీంనగర్

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల నిర్వహణ

#ministergangula

వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ సందర్భంగా అధికారులకు ధాన్యం కొనుగోళ్లపై దిశానిర్ధేశం చేసారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని, మాయిశ్చర్ మిషన్లు, ప్యాడీక్లీనర్లు, గన్నీలు సరిపడినంత అందుబాటులో ఉన్నాయన్నారు.

ధాన్యం కొనుగోళ్లు గత సంవత్సరం ఇదే రోజుతో పోలిస్తే దాదాపు 83వేల మెట్రిక్ టన్నులు ఎక్కువగా సేకరించామన్నారు. సోమవారం వరకూ 1,32,989 మంది రైతుల నుండి 8.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని తెలిపిన మంత్రి ఇందుకోసం 2.23 కోట్ల గన్నీలను వినియోగించామని అన్నారు. పూర్తి సేకరణకు అవసరమైన గన్నీలకు ఇబ్బందిలేదన్నారు. నవంబర్, డిసెంబర్ మాసాల్లోనే వానాకాలం ధాన్యం సేకరణ అధికంగా జరుగుతుందని వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా కోతలకు అనుగుణంగా 4579 కొనుగోలు కేంద్రాలను తెరిచామని అవసరాల మేరకు ఏర్పాటు చేసుకోవడానికి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన విదంగా రైతులు ఫెయిర్ ఆవరేజ్ క్వాలిటీతో ధాన్యాన్ని కొనుగోలుకేంద్రాలకు తీసుకురావాలని, ఎఫ్.ఏ.క్యూ వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే సేకరిస్తారని అన్నారు,

దేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే కనీస మద్దతు ధర గ్రేడ్ఏ 2,060, కామన్ రకానికి 2,040 రూపాయలు చెల్లిస్తూ ధాన్యం సేకరిస్తుందన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, డిప్యూటీ కమిషనర్ రుక్మిణి, పౌరసరఫరాల సంస్థ జీఎం రాజారెడ్డి,  ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

ప్రజా నమ్మకమే అధునిక పోలీస్ వ్యవస్థకు పునాది

Satyam NEWS

ఎర్రగడ్డ స్మశాన వాటిక అభివృద్ధికి చర్యలు

Satyam NEWS

సీఎం జగన్ పై సొంత చెల్లికే నమ్మకం లేదు: పుత్తా

Satyam NEWS

Leave a Comment