27.7 C
Hyderabad
April 19, 2024 23: 42 PM
Slider కరీంనగర్

వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయండి

#AdiSrinivas

కరోనా కష్టకాలంలో రైతులందరూ కూడా మానసికంగా ఇబ్బంది పడుతున్నారని టిపిసిసి కార్యదర్శి ఆది శ్రీనివాస్ అన్నారు. అందుకోసం రైస్ మిల్లులకు సంబంధం లేకుండా కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యాన్ని అమ్ముకునే సౌకర్యాన్ని రైతులకు కల్పించి ఆదుకోవాలని ఆయన కోరారు. తప్పా తాలు లేకుండా చేసిన తర్వాత కొనుగోలు కూడా పూర్తి అవ్వాలని అయితే ఆ తర్వాత రైస్ మిల్లర్ల నుండి కొందరు రైతులకు సమాచారం ఇచ్చి అదనంగా తూకం వేయడాన్ని మానుకోవాలని ఆయన అన్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల కొన్ని సెంటర్లలో ధాన్యం తడిసిందని ఆయన తెలిపారు. రైతులు ఆ ధాన్యాన్ని తిరిగి ఆరబెట్టిన తర్వాత ఆయా సెంటర్లకు తరలించారని, ఇలాంటి చోట్లకు అదనపు లారీలను పంపించి ధాన్యం కొనుగోలులను మరింత వేగం పరిచి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆయన కోరారు. టార్పాలిన్ కవర్లను అన్ని గ్రామాలలో కొనుగోలు కేంద్రాలలో సరిపడినంత అందివ్వాలని, తూర్పార యంత్రాలను కూడా ఆయా సెంటర్లకు ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వం పంపించాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

Related posts

కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

జగన్ గారూ, ఆ 40 వేల కోట్లూ ఏమయ్యాయో ప్రజలకు చెప్పండి

Satyam NEWS

మత మార్పిడులను సహించేది లేదు

Satyam NEWS

Leave a Comment