22.2 C
Hyderabad
December 10, 2024 09: 51 AM
Slider ఆదిలాబాద్

లోటుపాట్లు లేకుండా వరి ధాన్యం కొనుగోలు

#nirmalcollector

వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం భైంసా మండలం వానల్ పాడ్ గ్రామంలో సహకార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలనీ ఆదేశించారు. పంటను అమ్మేందుకు వచ్చే రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.

ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యపు మద్దతు ధర, తేమ శాతం వివరాలు, రైతు సహాయ కేంద్రం నంబరు తదితర వివరాలు తెలిపే బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. రైతులు నుంచి ఆధార్, బ్యాంక్, పట్టా పాస్ బుక్ తదితర జిరాక్స్ కాపీలను తీసుకొని త్వరితగతిన ధాన్యం అమ్మిన డబ్బులు వారి ఖాతాల్లో జమ అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం శ్రీ రాజరాజేశ్వర రైస్ మిల్లును అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి రైసుమిల్లులో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని పకడ్బందీగా భద్రపరచాలన్నారు.

అనంతరం భైంసా మండలంలోని పెండ్ పల్లి గ్రామంలో పిఎసిఎస్  (ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘం) వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ సందర్శించారు. నిర్ణీత తేమ శాతం పొందగానే రైతుల నుంచి వరి ధాన్యాన్ని సేకరించి వెంట వెంటనే ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. సేకరించిన ధాన్యానికి సంబంధించి రైతులకు రసీదుని ఇవ్వాలని తెలిపారు. కొనుగోలు కేంద్రానికి సంబంధించి రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ అధికారి కిరణ్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Related posts

అంగరంగ వైభవంగా శ్రీనివాసుడి కళ్యాణం

Bhavani

పోలీస్ రైడ్: వ్యభిచారగృహం పై పోలీసులు దాడి

Satyam NEWS

ప్రతి పెట్రోల్ బంకులో సిసి కెమెరాలు పెట్టాలి

Satyam NEWS

Leave a Comment