28.7 C
Hyderabad
April 20, 2024 06: 22 AM
Slider మహబూబ్ నగర్

ధాన్యం కొనుగోలు మళ్లీ ప్రారంభించడం హర్షణీయం

#paddy procrurment

గత 45 రోజులుగా నిలిచిపోయిన ధాన్యం కొనుగోలు మళ్లీ ప్రారంభించడం హర్షణీయమని బీసీ సంక్షేమ సంఘం మాదనాపురం మండల కన్వీనర్ మహేందర్ నాయుడు అన్నారు.

నిన్న అజ్జకొల్లు గ్రామంలో కొంతమంది  నాయకులు చదువురాని మహిళలచే ఖాళీ పేపర్ల మీద సంతకాలు తీసుకున్నారని, దీనికి కొంతమంది అధికారులు కూడా సహకరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు.

అమాయక ప్రజలను తికమక పెట్టే ఈవిధమైన చర్యలకు పాల్పడితే ఎవరిని ఉపేక్షించబోమని హెచ్చరించారు.

బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికై నిరంతరం పోరాటం చేస్తామని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా సరే  ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాయకులు వాయిపట్ల పెద్ద కొండన్న, సింగోటం నాయుడు, బోయపాపన్న తదితరులు పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Satyam NEWS

నెట్ ఫ్లిక్స్ మొదటి తెలుగు ఫిలిం పిట్ట కథలు

Sub Editor

గ్రీన్ జోన్లో భూమి పోతుందని ఆవేదనతో గడ్డి మందు తాగిన రైతు

Satyam NEWS

Leave a Comment