37.2 C
Hyderabad
March 29, 2024 20: 32 PM
Slider నిజామాబాద్

ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

#GampaGoverdhan

రైతులు పండించిన చివరి ధాన్యం గింజ కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల నుంచి నేరుగా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఫంక్షన్ హాలులో వ్యవసాయ అధికారులు, తహశీల్దార్లు, ఫ్యాక్స్ పిఈవోలు, మార్కెటింగ్ కమిటీ కార్యదర్శులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులతో కామారెడ్డి డివిజన్ వారి ధాన్యం కొనుగోలు కేంద్రాల సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. రైతు క్షేమంగా ఉంటేనే దేశం క్షేమంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసిందన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి వెంటనే నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేయడం గొప్ప సంకల్పమని చెప్పారు. నియంత్రణ పద్దతిలో సన్నరకం ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రభ్యత్వం ఆలోచిస్తోందని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు పెద్ద మనసుతో కొనుగోలు చేయాలని కోరారు.

337 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

కలెక్టర్ శరత్ కుమార్ మాట్లాడుతూ.. ఈ వానాకాలంలో 337 ధాన్యం  కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నారు. అవసరం ఉన్న చోట కేంద్రాలను పెంచడం జరుగుతుందని, అన్ని కేంద్రాలలో టార్పాలిన్ కవర్లు, గన్ని బ్యాగులు, తేమ కొలిచే యంత్రాలు, ధాన్యం కొలిచే యంత్రాలు సిద్ధం చేస్తున్నామన్నారు.

లక్షల 95 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని తెలిపారు. కోటి 23 లక్షల 75 వేల గన్ని బ్యాగులు అవసరం కాగా 62 లక్షల 52 వేల బ్యాగులు అందుబాటులో ఉన్నాయని, 61 లక్షల 23 వేల బ్యాగులు రావడం జరుగుతుందని తెలిపారు. రైతులకు టోకెన్లు ఇస్తామని, కొనుగోలు అనంతరం నేరుగా రైతుల ఖాతాలో డబ్బులు వేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు.

రవాణాకు సంబంధించి సమాచారం అందిన నాలుగు గంటల లోపు లారీలను ఏర్పాట్లను చేయాలని తహశీల్దార్లను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా పౌర సరఫరాల అధికారి కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

గ్రూప్ 1 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

Satyam NEWS

ప్రమోషన్:ఎయిర్ ఇండియా సీఎండీగా రాజీవ్ బన్సల్

Satyam NEWS

ఉత్సవాలు విజయవంతం

Murali Krishna

Leave a Comment