తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఎం ఆర్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తనకు పద్మశ్రీ వచ్చినందుకు రేవంత్ రెడ్డి తీవ్రంగా బాధపడుతున్నట్లు కనిపిస్తున్నదని ఆయన అన్నారు. నాకు పద్మశ్రీ వచ్చిందని బాధనా ..రేవంత్ రెడ్డి పేర్లు పంపిన వాళ్లకు రాలేదని బాధనా అనేది అర్ధం కావడం లేదని మంద కృష్ణ మాదిగ అన్నారు. అసలు రేవంత్ రెడ్డి ఎవరి పేర్లు పంపాడు.. ఇప్పటికే రేవంత్ పంపిన పేర్ల వ్యక్తులు అనేక లాభాలు పొందారు…మరి ఆ పేర్లను రేవంత్ బీజేపీ ప్రభుత్వానికి ఎందుకు పంపాడు.. నాకు పద్మశ్రీ వచ్చినందుకు రేవంత్ రెడ్డి బాధపడుతున్నాడా అనేది స్పష్టం చేయాలి అన్నారు.
previous post