27.7 C
Hyderabad
April 20, 2024 01: 32 AM
Slider విజయనగరం

తిరుప‌తి బ్ర‌హ్మోత్స‌వాల తరహాలో పైడితల్లి అమ్మ‌వారి జాత‌ర‌

#ministerbotsa

కేంద్ర ప్ర‌భుత్వ ఆదేశాలు,సూచ‌న‌లమేర‌కు,తిరుప‌తి బ్ర‌హ్మోత్స‌వాల మాదిరిగానే విజ‌య‌న‌గ‌రం శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మ‌వారి జాత‌ర ఉత్స‌వాలు జ‌ర‌ప‌నున్న‌ట్టు.. రాష్ట్ర పుర‌పాల‌క‌,ప‌ట్ట‌ణాభవృద్దిశాఖ‌మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. జిల్లా క‌లెక్ట‌రేట్ లో పైడిత‌ల్లి అమ్మ‌వారి ఉత్స‌వ నిర్వ‌హ‌ణ‌పై  జిల్లా స్థాయి అధికారుల‌తో జ‌రిగిన స‌మావేశం అనంత‌రం..మంత్రి బొత్స మీడియాతో ఈ విష‌యాన్ని తెలియ చేసారు.

క‌రోనా కార‌ణంగా..థ‌ర్ట్ వేవ్ ప్ర‌మాదం పొంచి ఉంద‌న్న డ‌బ్ల్యూహ‌చ్ ఓ హెచ్చ‌రిక‌ల‌తో గ‌తేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడ పైడితల్లి అమ్మ‌వారి జాత‌ర నిర్వ‌హించ‌నున్న‌ట్టు మంత్రి తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచీ వ‌స్తున్న ఈ పైడిత‌ల్లి అమ్మ‌వారి జాత‌ర‌…సంప్ర‌దాయం దృష్ట్యా…..కరోనా కార‌ణంగా నామ‌మాత్రంగానే ఆక్టోబ‌ర్ 18,19  తేదీల‌లో పైడిత‌ల్లి ఉత్స‌వాలు నిర్వ‌హిస్తున్న‌ట్టు మంత్రి చెప్పారు.

క‌రోనా ఫ‌స్ట్ వేవ్ ను అంత‌గా అంచ‌నావేయ‌లేక‌పోయాని…రెండో వేవ్ లో భారీన‌ష్టాన్ని చ‌విచూడాల్సి వ‌చ్చిందని..ఎంతో మంది ప్ర‌జ‌ల ప్రాణాలు పోయాయ‌న‌ని..ఆస‌మ‌యంలోవారిబాధలు వ‌ర్ణ‌ణాతీత‌మ‌న్నారు.ఆ ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకునే…ఈ సారి పైడిత‌ల్లి అమ్మ‌వారి పండ‌గ‌ను…కేవ‌లం  సంప్ర‌దాయ‌బ‌ద్దంగా…నామ మాత్రంగానే నిర్వ‌హించ‌దలిచామ‌న్నారు. 

వీవీఐపీ,వీఐపీ పాస్ లు ఈ సారికూడా  జారీ చేయ‌డం లేద‌ని మంత్రి బొత్స స్ప‌ష్టం చేసారు.అయితే ద‌స‌రా వెళ్లిన మంగ‌ళ‌వార‌మే పైడితల్లి  అమ్మ‌వారి తొలేళ్లు, సిరిమాను జాత‌ర ఉంటుంద‌ని..ఆ వారం రోజులు…అటు దేవాదాయ‌,ఇటు మున్సిప‌ల్ మ‌రోవైపు రెవిన్యూ,పోలీస్  శాఖ‌లు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. ప్ర‌భుత్వం  త‌రుపున కోటో అర కోటో నిధులు మంజూరు చేయ‌డం జ‌రుగుతుంద‌ని  మంత్రి బొత్స ఈ సంద‌ర్భంగా తెలిపారు.

మ‌రీ ముఖ్యంగా…శానిటైజ‌ర్,మాస్క్ లు త‌ప్ప‌న స‌రి అని ఆ రెండింటిపై అటు మున్సిప‌ల్ శాఖ‌లోని ప్ర‌జారోగ్య విభాగం  జాగ్ర‌త్త‌లు వ‌హించాల‌ని మున్సిప‌ల్ క‌మీష‌న‌ర్ ను ఆదేశించామ‌న్నారు. ఈ మీడియ స‌మావేశంలో విజ‌య‌గన‌గ‌రం ఎమ్మెల్యే  కోల‌గ‌ట్ల వీర‌భద్ర స్వామి,క‌లెక్టర్ సూర్య‌కుమారీ, ఎస్పీ దీపికా, కొత్త‌గా ఎన్నికైన జెడ్సీ చైర్మ‌న్ మ‌జ్జి శ్రీనివాస‌రావులు ఉన్నారు

Related posts

ఘనంగా భగీరథ జయంతి వేడుకలు

Satyam NEWS

ఇళ్ల స్థలాల పంపిణీలో వేగం పెంచాలి

Sub Editor

హంసల దీవి వద్ద ట్రాఫిక్ ఆంక్షలు

Satyam NEWS

Leave a Comment