33.2 C
Hyderabad
April 26, 2024 01: 21 AM
Slider ఆధ్యాత్మికం

హమ్మయ్య..అన్నట్లుగా జరిగిన పైడితల్లి అమ్మవారి దేవర ఉత్సవం…!

#paiditalli

ఉత్తరాంధ్ర కల్పవల్లిగా భాసిల్లుతున్న విజయనగరం పైడితల్లి అమ్మవారి దేవర ఉత్సవం కరోనా మూలంగా నామ మాత్రంగానే జరిగింది. ప్రతీ ఏటా హంగు ఆర్భాటం.. భక్తులు సందోహం నడమ జరిగే పైడితల్లి అమ్మవారి దేవర ఉత్సవం గతేడాది మాదిగానే జరిగింది.

పట్టుమని 20 మంది కూడా లేని మధ్య కేవలం ఆలయ ఉద్యోగస్థులు మాత్రమే హాజరై..పైడితల్లి ఉత్సవం ‘మమ’ అనిపించారు. అనుకున్న ప్రకారం రైల్వే స్టేషన్ వద్ద ఉన్న వనం గుడిలో ఉన్న అమ్మవారికి అక్కడే సంప్రదాబద్దంగా అభిషేకం నిర్వహించారు.. ఆలయ పురోహితులు.

అక్కడ నుంచీ ఊరేగింపుగా సీఎంఆర్ ,ఎన్సీఎస్ థియేటర్, కన్యకాపరమేశ్వరి టెంపుల్, గంటస్థంభం , టూటౌన్ పోలీసు స్టేషన్ మీదుగా మండపం వీధి అక్కడ నుంచీ హుకుపేటలో ఉన్న పూజారి ఇంటికి చేరుకున్నారు…అమ్మ వారు.

ఇక పూజారి ఇంటి నుంచీ మూడులాంతర్లు వద్ద ఉన్న వనంగుడి వద్ద ప్రతిష్టించిన అమ్మవారి దేవాలయం లో ఉత్సవ విగ్రహం తెచ్చి పెట్టారు.. ..పూజారి, ఆయన వంశస్థులు.

ఈ కార్యక్రమంలో ఈఓ కిషోర్ కుమార్, ఆలయ అనువంశిక పూజారి, దేవస్థానం ఉద్యోగులు పాల్గొన్నారు. వన్ టౌన్ సీఐ మురళీ సూచనల మేరకు ఎస్ఐ సూర్య నారాయణ ఆద్యంతం పోలీసు బందోబస్తు నిర్వహించారు.

Related posts

బాలకృష్ణ ఇంటి వద్ద భారీగా పోలీస్ ల మొహరింపు

Satyam NEWS

ఏపి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు ఇవి

Satyam NEWS

షేక్ పేట్ ఎమ్మార్వో భర్త ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment