25.7 C
Hyderabad
January 15, 2025 19: 11 PM
Slider ప్రపంచం

సీరియస్:పాక్ హిందూ బాలికలపై దాడులు సహించం

pak attacks on minor girls

పాకిస్తాన్‌లో ఇద్దరు మైనర్ హిందూ బాలికలను కిడ్నాప్ చేసిన సంఘటనపై భారత్ తమ అసహనాన్ని వ్యక్తం చేసింది.ఈ మేరకు డిల్లీలో పాకిస్తాన్ హైకమిషన్ సీనియర్ అధికారిని పిలిపించి కిడ్నాప్ కేసులపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసింది.పాక్ లోని సింధ్ ప్రావిన్స్లో ఇద్దరు హిందూ బాలికలను కిడ్నాప్ చేసిన తరువాత, పొరుగు దేశంలోని మైనారిటీలను రక్షించడానికి భారతదేశం త వంతు చర్యలు చేపట్టింది.

3 రోజుల క్రితం జనవరి 14 న సింధ్ ప్రావిన్స్‌లోని ఒక గ్రామం నుంచి మైనారిటీ హిందూ వర్గానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు శాంతి మేఘ్వాడ్, సర్మి మేఘ్వాడ్లను అపహరించారు.పాకిస్తాన్‌లో మైనారిటీ హిందువులపై సిక్కు వర్గానికి చెందిన బాలికలపై చాలా కాలంగా అత్యాచారాలు జరిగుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నెల ప్రారంభంలో, పాకిస్తాన్లోని నంకనా సాహిబ్ గురుద్వారాలో ఒక అత్యాచార దాడులు జరిగాయని దీనిపై భారథ్ ఆందోళన వ్యక్తం చేసింది.

సిక్కుల పవిత్ర స్థలంలో ఈ సంఘటన అనాగరికమైన మరియు అసభ్యకరమైన సంఘటన అని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. పాకిస్తాన్‌లో మైనారిటీలను వేధిస్తున్నారు. చారిత్రాత్మక గురుద్వారాలో విధ్వంసం జరిగిన సంఘటనపై విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఆందోళన వ్యక్తం చేసింది.


సింధి హిందూ అమ్మాయి నమ్రతా చందాని గత ఏడాది పాకిస్తాన్‌లో హత్యకు గురయ్యారు. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని లార్కనాలోని మెడికల్ కాలేజీలో నమ్రత చందాని విద్యార్థి.కాగా ఇండియా లో కూడా ఇలాంటి దాడులు తమ వారి పై జరుగుతున్నాయని పాక్ లోని ఇండియన్ రాబరిని పిలిచి హెచ్చరించడం పాక్ అహంకార ధోరణికి అడ్డం పడుతుంది.

Related posts

బిజినెస్ మెన్ జగన్ రెడ్డి…

Satyam NEWS

శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ47

Satyam NEWS

జుక్క‌ల్‌లో రైతు వ్య‌తిరేక బిల్లుల‌పై నిర‌స‌న‌

Sub Editor

Leave a Comment