26.2 C
Hyderabad
November 3, 2024 22: 24 PM
Slider ప్రపంచం ముఖ్యంశాలు

పంజాబ్ లో చైనా డ్రోన్లతో పాకిస్తాన్ ఆగడాలు

pakistan drones

చైనా రూపొందించిన డ్రోన్లను వినియోగిస్తూ పాకిస్తాన్ అక్రమంగా భారత్ లోకి ఆధునాతన ఆయుధాలను, మాదకద్రవ్యాలను పంపిస్తున్నది. గత నెల రోజులుగా ఈ వ్యవహారం శృతి మించడంతో భారత సరిహద్దు భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్ పూర్ వద్ద నున్న హుస్సేనీవాలా చెక్ పోస్టు వద్ద పాకిస్తాన్ పంపిన మూడు డ్రోన్లు తాజాగా భద్రతాదళాలను టెన్షన్ పెట్టాయి. సుమారుగా ఐదు సార్లు ఈ డ్రోన్లు సరిహద్దు వెంట ఎగరడమే కాకుండా ఒక సారి సరిహద్దు దాటి భారత్ లోకి ప్రవేశించడంతో భారత భద్రతా దళాలు తమ ఉన్నతాధికారులను అప్రమత్తం చేశాయి. భద్రతాదళాల ఉన్నతాధికారులు, పంజాబ్ పోలీసులు, ఇంటెలిజెన్సు అధికారులు తక్షణమే రంగంలోకి దిగి కేసు పరిశీలన మొదలు పెట్టారు. కొద్ది రోజుల కిందట తరన్ తరాన్ ప్రాంతంలోని జహబల్ వద్ద 15 రోజుల కిందట ఒక డ్రోన్ ను కాలిపోయి ఉన్న స్థితిలో గుర్తించారు. గత ఎన్నిమిది రోజులుగా పాకిస్తాన్ నుంచి మాదక ద్రవ్యాలు, ఏకే 47 రైఫిళ్లు, దొంగ నోట్లు డ్రోన్ల సాయంతో భారత్ లోకి వచ్చేస్తున్నాయి. ఇటీవలె మళ్లీ ప్రారంభమైన ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్సు తమ కార్యకలాపాలను ఉధృతం చేస్తున్నదా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ గ్రూప్ నకు పాకిస్తాన్ పూర్తిగా సహాయం అందిస్తున్నది. పాకిస్తాన్ తో బాటు జర్మనీ లోని ఒక ఉగ్రవాద సంస్థ కూడా ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్సు గ్రూప్ నకు అండగా ఉన్నది. ఈ విషయాలన్నీ పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్సు అధికారులు కనిపెట్టి సరిహద్దు భద్రతాదళాలను అప్రమత్తం చేశారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ డ్రోన్లు కనిపించడం పాకిస్తాన్ కుయుక్తులను వెల్లడి చేస్తున్నది.

Related posts

నామినేటెడ్ పదవుల్లో కూడా ముస్లింలకు అన్యాయం

Satyam NEWS

విద్యార్థులకు షీ టీం పై భరోసా కల్పించిన ఏఎస్పి సిహెచ్ రామేశ్వర్

Satyam NEWS

ప్రజలకు అందుబాటులో వుండే సీపీఎం అభ్యర్థిని గెలిపించండి

Satyam NEWS

Leave a Comment