27.7 C
Hyderabad
April 26, 2024 03: 03 AM
Slider ప్రపంచం

పాకిస్తాన్ కు ఊరట: FATF గ్రే లిస్ట్ నుంచి తొలగింపు

#pakistanflag

మనీలాండరింగ్ మరియు యాంటీ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ సిస్టమ్ (AML/CFT) నుంచి పాకిస్తాన్ కు ఊరట లభించింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) గ్రే లిస్ట్ నుంచి పాకిస్థాన్ ను తొలగించారు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) అనేది అంతర్జాతీయ సంస్థ. తీవ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చడం, మనీలాండరింగ్ కేసులను ఇది పర్యవేక్షిస్తుంది. నేడు FATF పారిస్‌లో సమావేశమైంది. ఈ సమావేశంలో పాకిస్థాన్‌ను గ్రే లిస్ట్‌లో ఉంచాలా వద్దా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకున్నారు.

ఎఫ్‌ఎటిఎఫ్ ప్రస్తుత అధ్యక్షుడు సింగపూర్‌కు చెందిన టి.రాజ కుమార్ రాత్రి 8.30 గంటల ప్రాంతంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పాకిస్థాన్‌ను గ్రే లిస్ట్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. 2018 నుండి పాకిస్తాన్ గ్రే లిస్టులో ఉన్నది. మనీలాండరింగ్ మరియు యాంటీ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ సిస్టమ్ (AML/CFT)ని మరింత మెరుగుపరిచేందుకు మనీలాండరింగ్‌పై ఆసియా/పసిఫిక్ గ్రూప్ (APG)తో కలిసి పని చేయాల్సి ఉంటుంది. AML/CFT పాలనను మెరుగుపరచడంలో పాకిస్థాన్ సాధించిన గణనీయమైన పురోగతిని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ స్వాగతించింది.

పాకిస్తాన్ తన AML/CFT పాలన ను బలోపేతం చేసింది. FATF ద్వారా గుర్తించబడిన వ్యూహాత్మక లోపాలకు సంబంధించి దాని కార్యాచరణ ప్రణాళికల కట్టుబాట్లను తీర్చడానికి సాంకేతిక లోపాలను పాకిస్తాన్ పరిష్కరించింది. పాకిస్తాన్ తో బాటు నికరాగ్వా ను కూడా గ్రేలిస్టు నుంచి తొలగించారు.

Related posts

జ‌ర్న‌లిస్టుపై ఎమ్మెల్యే ప్ర‌వ‌ర్త‌న‌పై నిర‌స‌న ర్యాలీ

Sub Editor

కరోనా కోరల్లో చిక్కుకున్న ఒక చిన్న గ్రామం

Satyam NEWS

మెడికవర్ వద్ద ఫ్లైఓవర్ కోసం కృషి: ఎంపీ ఆదాల వెల్లడి

Satyam NEWS

Leave a Comment